Home

»

Bollywood News

కృతి తాజా చిత్రానికి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Oct 8, 2021 5:27PM

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `మిమి`.. న‌టిగా త‌న‌కు ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఇందులో టైటిల్ రోల్ లో త‌న‌దైన అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేసింది కృతి. క‌ట్ చేస్తే.. కృతి త‌దుప‌రి చిత్రం `హ‌మ్ దో హ‌మారా దో` కూడా మ‌రో ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంద‌ని రీసెంట్ గా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 29న `హ‌మ్ దో హ‌మారా దో`ని స్ట్రీమ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అభిషేక్ జైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని దినేజ్ విజ‌న్ నిర్మించారు. ఇందులో కృతి తో పాటు రాజ్ కుమార్ రావ్, ప‌రేశ్ రావెల్, ర‌త్నా పాఠ‌క్ షా ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. త‌న పెళ్ళి కోసం త‌ల్లిదండ్రుల్ని ద‌త్త‌త తీసుకున్న ఓ యువ‌కుడి క‌థ‌గా `హమ్ దో హ‌మారా దో` తెర‌కెక్కింది. మ‌రి.. దీపావ‌ళి స్పెష‌ల్ గా స్ట్రీమ్ కానున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్.. వీక్ష‌కుల‌ను ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి. అలాగే, కృతి ఖాతాలో మ‌రో ఓటీటీ హిట్ చేరుతుందా?  లేదా? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com