కొత్త సీతాకోక చిలకల్నిపట్టబోతున్నారు
on Dec 2, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన '1 ' నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులని పరిచయమైన నార్త్ ఇండియన్ భామ కృతి సనన్(kriti sanon)పలు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తు తన సత్తా చాటుతున్న కృతి సనన్, లాస్ట్ ఇయర్ ప్రభాస్ రాముడిగా చేసిన అది పురుష్ లో సీతగా చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.
రీసెంట్ గా 'దో పత్తి'(do patti)అనే ఒక వినుత్నమైన కదాంశంతో కూడిన సినిమాలో నటించింది.అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే నమోదు చేసిన ఆ మూవీకి కృతి సనన్ నే నిర్మాతగా వ్యవహరించింది.తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాతగా కొత్త దశ ని ఆస్వాదిస్తున్నాను. నా నిర్మాణ సంస్థ బ్లూ బట్టర్ ఫ్లై బ్యానర్ ద్వారా 'దో పత్తి' లాంటి మరికొన్ని కొత్త సీతాకోక చిలుకలు రాబోతున్నాయి.అందు కోసం భారతీయ సినిమా చరిత్రలోఇంతవరకు తెరకెక్కని కథల కోసం అన్వేషిస్తున్నాను. మూవీ లవర్స్ ని ఆశ్చర్య పరిచే సిమిమాలు తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
దీని ద్వారా నేను నటించే పాత్రలని సృష్టించుకునే అవకాశం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది.భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే సినిమాలని నిర్మిస్తానననే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కృతి ప్రస్తుతం ధనుష్(dhanush)హీరోగా తెరెక్కుతున్న 'తేరే ఇష్క్ మే' అనే చిత్రంలో చేస్తుంది.