అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?
on Dec 17, 2021
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లో పంజాబీ స్టైల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం అత్తగారింట్లో అడుగు పెట్టిన కత్రినా.. తొలిసారి తాను వండిన వంటకం ఏమిటో తాజాగా చెప్పేసింది.
వివాహం అనంతరం అత్తగారింట్లో అడుగుపెట్టిన వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం ఉంది. పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన కత్రినా కూడా ఈ ఆచారాన్ని పాటించింది. అత్తగారింట్లో కత్రినా తొలిసారిగా తన చేత్తో హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కత్రినా.. తానే చేసానని చెప్పుకొచ్చింది. ఇక కత్రినా వంటకి విక్కీ ఫిదా అయిపోయాడు. ఇప్పటివరకు నేను తిన్న బెస్ట్ హల్వా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు.
కత్రినా అత్తగారింట్లో వండిన హల్వా స్వీట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ అయినా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read