
స్టార్ హీరోయిన్ 'కరీనాకపూర్ ఖాన్ 'కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. సుదీర్ఘ కాలం నుంచి తన క్రేజ్ ని ఇంచు కూడా తగ్గేలా చేసుకోకుండా అద్భుతమైన క్యారెక్టర్స్ తో అభిమానులు, ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది.
తాజాగా కరీనా ఒక ఖరీదైన ఆభరణం కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా కరీనా తన ప్రత్యేకమైన లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆమె ప్యూన్ బలానా బ్రాండ్‌కు చెందిన ఒక అందమైన లేత గోధుమరంగు కఫ్తాన్ ధరించి అద్భుతంగా కనిపించారు. అయితే అందరి దృష్టి ఆమె దుస్తులపై కాకుండా, మెడలో ధరించిన దాదాపు 30 క్యారెట్ల బరువున్న పచ్చ లాకెట్ తో పాటు సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన రాయల్ ఆభరణాలపై నిలిచింది.
ఈ ప్రత్యేకమైన లాకెట్‌పై పవిత్ర ఖురాన్‌లోని ప్రసిద్ధ వచనమైన 'ఆయత్ అల్ కుర్సీ' (Ayat al-Kursi) చెక్కబడి ఉండటమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ కరీనా కపూర్‌కి, ఆమె స్టైలిస్ట్ రియా కపూర్‌కు లీగల్ నోటీసులు జారీ చేయడం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది.

ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఆభరణం సాధారణమైనది కాదు. ఇది భోపాల్ రాజకుటుంబ వారసత్వ సంపదగా వస్తున్న అత్యంత విలువైన వస్తువు. కరీనా కపూర్ భర్త, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తాతల నాటి నుంచి ఇది వారి కుటుంబంలో వస్తోంది. భోపాల్ చివరి పాలకుడైన నవాబ్ హమీదుల్లా ఖాన్ కుమార్తె, సైఫ్ అలీ ఖాన్ తండ్రి అయిన సజిదా సుల్తాన్ ద్వారా ఈ 30 క్యారెట్ల పచ్చ లాకెట్ వారసత్వంగా సంక్రమించింది.
ఇది కూడా చదవండి: Goat Movie Review Telugu: Goat మూవీ రివ్యూ
సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాచీన రాజ ఆభరణాన్ని 2012లో సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ వివాహ సమయంలో సైఫ్ కూడా ధరించారు. అయితే, ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ పవిత్ర ఖురాన్ వచనాలు చెక్కిన లాకెట్‌ను కేవలం ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా, దీపావళి ఫొటో షూట్‌లో ధరించి ప్రదర్శించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పవిత్ర మత గ్రంథాల వచనాలను ఈ విధంగా ఆభరణాలుగా వాడటం, వాటి పవిత్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ పంపిన లీగల్ నోటీసులో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఈ లాకెట్‌కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి పవిత్ర వచనాలను ప్రదర్శించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. మరోవైపు, ఈ వివాదంపై భోపాల్‌కు చెందిన హిందూ ఉత్సవ్ సమితి మరియు సంస్కృతి బచావో మంచ్ వంటి కొన్ని హిందూ సంఘాలు మాత్రం కరీనా కపూర్‌కు మద్దతుగా నిలిచాయి.

వారసత్వంగా వచ్చిన పురాతన ఆభరణాలను ధరించడంలో తప్పులేదని, దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లీగల్ నోటీసులపై ఇప్పటివరకు కరీనా కపూర్ గానీ, ఆమె స్టైలిస్ట్ రియా కపూర్ గానీ ఎటువంటి అధికారిక స్పందన లేదా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మీకు నచ్చవచ్చు: ది ప్యారడైజ్ పై బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు!
మీకు నచ్చవచ్చు: టిల్లు మావ కొత్త సినిమా!
[Kareena Kapoor, Quran Ayat, saif Ali khan, Bollywood, Emerald Pendant]




