ఇంట్లో నేనే సింహాన్ని అని చెప్పాను కాబట్టి నా భర్త ఏంటో మీరే చెప్పండి
on Oct 16, 2024

షారుక్ ఖాన్(shah rukh khan)హీరోగా 1995లో రిలీజైన దిల్ వాలే దుల్హనియా లేజా యాంగే మూవీ సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే.ప్రేమించి పెళ్లాడుతా పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి చాలా కేంద్రాల్లో శతదినోత్సవాన్నీ జరుపుకుంది. ఈ మూవీలో షారుక్ కి జతగా చేసిన హీరోయిన్ కాజోల్(kajol)సిమ్రాన్ అనే క్యారెక్టర్ లో అత్యద్భుతంగా నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ కూడా అయ్యింది.ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.
ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్(ajay devgn)ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైన కాజోల్ కొంత కాలం నుంచి అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా ధో పట్టి(do patti)అనే థ్రిల్లర్ మూవీ చేస్తుంది. కృతి సనన్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా కాజోల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తుంది.రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న కాజోల్ మీడియా అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తి కర విషయాలని వెల్లడించింది.మీరు తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు కదా, మీ భర్త అజయ్ దేవగన్ ఆల్రెడీ సింగం మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చేసాడు. కాబట్టి, ఆయన నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారా అని మీడియా వాళ్ళు అడిగారు. అప్పుడు కాజోల్ మాట్లాడుతూ ఇంట్లో నేనే సింహాన్ని, పాత్ర కోసం అజయ్ నుంచి ఎలాంటి సలహాలు తీసుకోలేదని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు.

దో పత్తి లో కృతి సనన్ అక్కా చెల్లెళ్లుగా డ్యూయల్ రోల్స్ లో చేస్తుండగా ఆ ఇద్దరి మద్య ఉన్న కొన్ని రహస్యాలని కాజోల్ వెలికి తియ్యనుంది.ఈనెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీకి శశాంక చతుర్వేది(shashanka chaturvedi)దర్శకుడు కాగా కృతి సనన్ నే నిర్మాతగా వ్యవహరిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



