'వార్ 2'లో వంద మందితో ఎన్టీఆర్ ఫైట్.. గెస్ట్ రోల్ లో సూపర్ స్టార్!
on Oct 24, 2024
ఇటీవల 'దేవర'తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' (War 2)తో బిజీ అయ్యాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయట. ముఖ్యంగా ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్ లు ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో 'వార్-2' గురించి తెగ చర్చ జరుగుతోంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్ లు బిగ్ స్క్రీన్ ని షేక్ చేస్తాయని అంటున్నారు. షావోలిన్ టెంపుల్ లో భారీ కత్తి ఫైట్ తో హృతిక్ పాత్ర పరిచయం అవుతుందట. ఇక ఎన్టీఆర్ ఇంట్రో అయితే.. సముద్రంలో ఒక భారీ షిప్ లో దాదాపు వంద మందితో ఫైట్ సీన్ ఉంటుందట. ఈ రెండు ఇంట్రో సీన్ లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అద్భుతంగా ప్లాన్ చేశాడట. సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్ ఐ ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే హృతిక్, ఎన్టీఆర్ కలయికతో.. నార్త్, సౌత్ అనే లేకుండా 'వార్-2' పాన్ ఇండియాని షేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇది చాలదు అన్నట్టు ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ కూడా భాగమవుతున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడని సమాచారం.
Also Read