ఆందోళనలో బాలీవుడ్ అగ్ర హీరో..పాకిస్థాన్ లో ఉండి ఉజ్మాఅహ్మద్ ని భలే రక్షించాడు
on Mar 29, 2025
మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్(Bollywood)లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో జాన్ అబ్రహం(JOhn Abraham)ధూమ్, విరుద్,ఎలాన్,కరం,వాటర్,గరం మసాలా,జిందా,టాక్సీ no 9211,వెల్ కమ్ బ్యాక్,రేస్ 2 ,ఫోర్స్,హౌస్ ఫుల్ 2 ,సత్యమేవ జయతే 2 ఎటాక్,దోస్తానా,న్యూయార్క్,రేస్ 2 ,మద్రాస్ కేఫ్, సర్దార్ కా గ్రాండ్ సన్,పఠాన్,వేద ఇలా ఎన్నో చిత్రాల్లో సోలో హీరోగాను,హీరోల్లో ఒకడి గాను నటించి అశేష సినీ ప్రేమికుల అశేష అభిమానాన్ని పొందాడు.ఈ నెల 14 న 'ది డిప్లొమాట్' అనే విభిన్నకాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రీసెంట్ గా జాన్ అబ్రహం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు హిందీ చిత్ర పరిశ్రమకి చెందిన వాడిగా హిందీ చిత్ర పరిశ్రమ విషయంలో ఆందోళన చెందుతున్నాను.ఇక్కడ విభిన్న
కథలతో కూడిన సినిమాలు తెరకెక్కడం లేదు.నేను కమర్షియల్ హీరోని, ఆ ఇమేజ్ చట్రంనుంచి బయటకొచ్చి విభిన్న సినిమాల్లో నటించాలి.ఆ విధంగా అందరు చెయ్యాలంటే నటీనటులతో పాటు దర్శక నిర్మాతలకు స్వేచ్ఛ ఉండాలి.అలాంటప్పుడే హిందీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.సోషల్ మీడియాలో కూడా హిందీ సినిమాలపై తీవ్రమైన విమర్శలు వస్తుంటే చాలా వేదనగా ఉందని చెప్పుకొచ్చాడు.
'ది డిప్లొమాట్'(The Diplomat)మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.పాకిస్తాన్ దేశంలోని ఇస్లామాబాద్ లో భారతదేశం తరుపున డిప్యూటీ హై కమిషనర్ అధికారిగా పని చేసే జెపీసింగ్ క్యారక్టర్ లో జాన్ అబ్రహం అద్భుతంగా నటించాడు.ఉజ్మాఅహ్మద్ అనే ఇండియన్ మహిళ పాకిస్థాన్ కి చెందిన తాహిర్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని పాకిస్థాన్ లో నివసిస్తు ఉంటుంది.కానీ ఆ తర్వాత తాహిర్ నిజస్వరూపం తెలుసుకొని అతని చిత్ర హింసలని భరించలేక జెపీ సింగ్ వద్దకు వచ్చి నేను ఇండియన్ మహిళని అక్కడకి పంపించమని చెప్తుంది.దాంతో జె పి సింగ్ ఆమె చెప్పేది నిజామా,అబద్దమా అని ఎలా తెలుసుకున్నాడు? ఆమెని ఇండియాకి పంపించడానికి ఏం చేసాడనే కథాంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.భారత దౌత్యవేత్త జె పీ సింగ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది.శివమ్ నాయర్(Shivam Nair)దర్శకత్వం వహించగా టి సిరీస్,జె ఏ ఎంటర్ టైన్ మెంట్ మరికొంత మందితో కలిసి నిర్మించాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
