ప్రియాంక, కత్రినా, ఆలియా.. ఓ రోడ్ ట్రిప్!
on Jun 13, 2022
ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్.. హిందీనాట తమదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన అగ్ర కథానాయికలు. పెళ్ళయ్యాక కూడా నటిస్తూ ముందుకు సాగుతున్న ఈ ముగ్గురు స్టార్ బ్యూటీస్.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో కలిసి సందడి చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. మల్టిటాలెంటెడ్ ఫర్హాన్ అఖ్తర్ `జీ.. లే జరా` పేరుతో ఓ మల్టిస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు సరాదాగా చేసిన రోడ్ ట్రిప్ ఎలాంటి ఘటనలకు దారి తీసింది? ఆపై చోటు చేసుకున్న అనూహ్య మలుపులేంటి? అనే కథాంశంతో ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట ఫర్హాన్. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంలో ఆ ముగ్గురు అమ్మాయిలుగా ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ నటన సినిమాకి ఎస్సెట్ గా నిలుస్తుందట. 2023 జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023 చివరలో లేదా 2024 ప్రథమార్ధంలో జనం ముందుకు వచ్చే అవకాశముంది. మరి.. ఈ ఫిమేల్ సెంట్రిక్ మల్టిస్టారర్ తో ప్రియాంక, కత్రినా, ఆలియా ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Also Read