వార్ 2 ప్రమోషన్స్.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి రావట్లేదు.. ఏం జరుగుతోంది?
on Jul 2, 2025
YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంది. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంటుంది. 'వార్ 2'లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతోన్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది.
హృతిక్, ఎన్టీఆర్ కలిసి 'వార్ 2'ని ప్రమోట్ చేయరు. ఏ ఈవెంట్‌లో కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. అసలు 'వార్ 2' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. ఆ ఇద్దరినీ డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ పైన చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుందని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం ఈ నిర్ణయం తీసుకుందట.
YRF స్పై యూనివర్స్ ఎప్పుడూ కూడా తమ సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటుంది. 'వార్' విషయంలోనూ ఇలాంటి ఓ స్ట్రాటజీనే ఫాలో అయింది. సినిమా రిలీజ్‌కు ముందు ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. హీరోలిద్దరూ కలిసి కనిపించలేదు. ‘వార్’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లోనే హీరోలిద్దరూ కనిపించారు. 'పఠాన్' విషయంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే సినిమాపై బజ్‌ను పెంచారు. చివరకు 'పఠాన్' ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలా స్పై యూనివర్స్ నుంచి వచ్చే ప్రతి సినిమాకి కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'వార్ 2' అని చెప్పవచ్చు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంతో కియారా అద్వానీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
