అగ్ర హీరో ఇంట్లో తెల్లవారుజామున గన్ తో కాల్పులు..తీవ్ర రక్త స్రావంతో హాస్పిటల్ లో జాయిన్
on Oct 1, 2024
1980 , 90 వ దశకాల్లో హిందీ చిత్ర సీమని ఒక ఊపిన హీరోల్లో గోవిందా(govinda)కూడా ఒకడు.కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకి పెట్టింది పేరైన గోవిందా ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ముంబై నార్త్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున రెండువేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎంపి గా పని చేసిన గోవిందా ప్రస్తుతం శివసేన పార్టీలో యాక్టీవ్ గా ఉన్నాడు.
రీసెంట్ గా గోవిందా కి బుల్లెట్ గాయాలు అయినట్లుగా తెలుస్తుంది.ముంబైలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తన లైసెన్సు రివాల్వర్ ని క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులోనుంచి వచ్చిన బుల్లెట్ గోవిందా కాలికి తగలడంతో తీవ్ర రక్తస్రావమయ్యింది.దీంతో కుటుంబ సభ్యులు గోవిందని అంధేరిలోని కృతి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలికి తీవ్ర గాయాలు అయినట్లు గా తెలుస్తుంది.
ఇక గోవిందా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గోవిందాకి భార్య, ఒక కూతురు కొడుకు ఉన్నారు. కూతురు టీనా అహుజా కొన్ని సినినిమాల్లో హీరోయిన్ గాను చేసింది.
Also Read