'గంగూబాయ్' ట్రైలర్.. ఆలియా అదరహో.. అజయ్ అదుర్స్!
on Feb 4, 2022

ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ కలిసి నటించిన 'గంగూబాయ్ కథియవాడి' మూవీ ట్రైలర్ వచ్చేసింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1960లలో ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాఠిపురను ఏలిన గంగూబాయ్ జీవిత కథను మనముందు ప్రెజెంట్ చేస్తుంది. ఇంతదాకా ఆలియా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎందులో కనిపించిందంటే, 'రాజీ' పేరునే చెబుతారు ఎక్కువమంది. వాళ్లంతా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.
బాలీవుడ్ బెస్ట్ యాక్ట్రెస్‌లలో తాను ముందు వరుసలో ఉంటానని గంగూబాయ్ క్యారెక్టర్‌తో మరోసారి నిరూపించుకుంది ఆలియా. ఆమె డైలాగ్ డెలీవరీ, మేనరిజమ్, ఎక్స్‌ఫ్రెషన్స్.. అన్నీ వండర్‌ఫుల్ అనిపించే రీతిలో ఉన్నాయి. తన మునుపటి పాత్రల నటనతో పోలిస్తే, భన్సాలీ డైరెక్షన్‌లో గంగూబాయ్‌గా ఆమె నటన మరో మెట్టు పైకెక్కిందనేది నిజం. ట్రైలర్‌కు సంబంధించిన మరో హైలైట్.. అజయ్ దేవ్‌గణ్ ఎంట్రీ. ఆయన పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో విజిల్స్ గ్యారంటీ.
భన్సాలీ సినిమాల్లో మ్యూజిక్ అనేది కీలక పాత్ర వహిస్తుందని మనకు తెలుసు. 'గంగూబాయ్ కథియవాడి' అందుకు మినహాయింపు కాదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్‌లో ఉంది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిసిపోతోంది. ఫిబ్రవరి 25న మనముందుకు వస్తున్న పూర్తి సినిమా ఏ రీతిలో మనల్ని మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



