అక్టోబర్ 3 న బ్రహ్మాండం బద్దలవ్వబోతుంది..సినిమాకి ఉన్న గొప్పతనం అదే
on Sep 30, 2024
మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(indira gandhi)రాజకీయ జీవితంలో చీకటి రోజులుగా అభివర్ణించే, ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా బాలీవుడ్ లో ఎమర్జెన్సీ(emergency)అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద నటి కంగనా రనౌత్(kangana ranaut)టైటిల్ రోల్ పోషించడంతో ఎమర్జెన్సీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉండటంతో పాటు మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ ఆరవ తేదీన ఎమర్జెన్సీ మూవీ థియేటర్ లో అడుగుపెట్టాలి. కానీ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మూవీలోని కొన్నిసన్నివేశాలకి అభ్యంతరం చెప్పడంతో రిలీజ్ ఆగిపోయింది. దీంతో చిత్ర బృందం కొన్ని రోజులు క్రిత్రం కోర్టు మెట్లు ఎక్కింది.సెన్సార్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని బాంబై హైకోర్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మరియు నిర్మాణ సంస్థల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై హైకోర్టులో వాదనలు జరిగాయి. బోర్డు సూచించిన కట్స్ కి తాము అంగీకరిస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ తరుపు న్యాయవాది తెలపడంతో పాటుగా కొంత సమయం కావాలని అడిగింది.దీంతో తదుపరి విచారణ అక్టోబర్ 3 కి వాయిదా పడింది. మరి ఆ రోజు ఏం జరగబోతుందనే ఆసక్తి సినిమావర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొని ఉంది.
ఎమర్జెన్సీ ప్రచార చిత్రాలు విడుదలైనప్పట్నుంచే ఎన్నో విమర్శలు వచ్చాయి.అందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సెన్సార్ బోర్డుకి ఒక లేఖ కూడా రాసింది.ఒక దశలో కంగనాని చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయి.అనుపమ్ కేర్, అనుపమ చౌదరి ప్రధాన పాత్రలో చెయ్యగా నిర్మాత, దర్శకురాలుగా కంగనానే వ్యవహరించింది.ప్రస్తుతం ఆమె బీజేపీ తరుపున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read