అక్క ఆర్మీ ఆఫీసర్, చెల్లెలు పాన్ ఇండియా స్టార్!
on Jul 26, 2025
బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఎంతో మంది హీరోయిన్లు తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు. లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంఎస్ ధోని సినిమాతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. బాఫీు 2, భారత్ రాధే, కల్కి 2898 ఏడీ వంటి భారీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంది.
యూత్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసే అందంతోపాటు చక్కని అభినయంతో ఆకట్టుకునే దిశాపటాని బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇదిలా ఉంటే.. దిశా అక్క ఖుష్బూ పటాని.. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆమె చూసిన కొన్ని ఘోరమైన ఘటనలు ఆమెను సైన్యంలో చేరాలా చేశాయి. తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌బి ఎంట్రన్స్‌లో పాస్ అయింది. ఆర్మీలో చేరిన కొన్నాళ్ళకు లెఫ్టినెంట్ అయ్యింది. అంతేకాదు, 34 ఏళ్ళకే మేజర్‌గా ఎదిగింది. ఉద్యోగ విరమణ చేసిన ఖుష్బూ.. ప్రస్తుతం వైద్యురాలిగా, ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఖుష్బూకి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అక్కాచెల్లెళ్ల గురించే చర్చ నడుస్తోంది. నెటిజన్లు వీరిద్దరినీ అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



