శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు.. FIR నమోదు! భర్త వల్లేనా ఈ కష్టాలు!!
on Nov 14, 2021

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, మరికొందరిపై ముంబైకి చెందిన ఒక బిజినెస్‌మ్యన్ చీటింగ్ కేసు పెట్టాడు. తనను వారు రూ. 1.51 కోట్ల రూపాయల మేర మోసం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నితిన్ బారై అనే ఆయన ఆరోపించాడు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. లాభాలు వస్తాయని చెప్పి వ్యాపారంలో రూ. 1.51 కోట్లు పెట్టుబడిగా పెట్టమని SFL ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 2014 జూలైలో అడిగారని ఆ ఫిర్యాదులో నితిన్ తెలిపాడు.
SFL ఫిట్‌నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీని అందజేయడమే కాకుండా, పూణే పొరుగున ఉన్న హడప్సర్, కోరేగావ్ ప్రాంతాల్లో ఒక జిమ్ అండ్ స్పాను తెరుస్తుందని తన హామీ ఇచ్చారనీ, అయితే ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని ఆయన పేర్కొన్నాడు. దాంతో తన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగితే తనను బెదిరించారని ఆరోపించాడు.
ఈ ఫిర్యాదును ఆధారం చేసుకొని ఐపీసీలోని 420 (చీటింగ్), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (కామన్ ఇంటెన్షన్) సెక్షన్ల కింద FIR రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బాంద్రా పోలీసులు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



