హృతిక్ రోషన్ తెలుగు ఫిల్మ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
on Apr 8, 2025
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో కలిసి 'వార్-2' (War 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ షూటింగ్ టైంలో ఎన్టీఆర్ ప్రతిభకు హృతిక్ ఫిదా అయ్యాడు. ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టర్ అని కొనియాడాడు. ఇదిలా ఉంటే, తెలుగు యాక్టర్ ని మెచ్చుకోవడమే కాదు.. త్వరలో తెలుగు మేకర్స్ తో సినిమా చేయడానికి సైతం హృతిక్ సిద్ధమవుతున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో చేసిన 'డాకు మహారాజ్' చిత్రంతో మెప్పించిన దర్శకుడు బాబీ.. తన తదుపరి సినిమాని హృతిక్ తో చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల హృతిక్ ని కలిసిన బాబీ.. కథ కూడా వినిపించాడట. బాబీ చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన హృతిక్.. కంప్లీట్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్ తో కూడా హృతిక్ ఇంప్రెస్ అయితే.. ఈ ఏడాదిలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ఫిల్మ్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
