పన్నెండేళ్ల పెద్ద హీరోయిన్ డేటింగ్ కి గుడ్ బై
on Oct 29, 2024
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు అర్జున్ కపూర్(arjun kapoor)దివంగత శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ మొదటి భార్య కొడుకైన అర్జున్ కపూర్ 2012 లో ఇష్క్ జాదే అనే సినిమాతో తెరంగ్రేటం చేసాడు. ఔరంగజేబు, గుండే, టూ స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ఏక్ విలన్ రిటర్న్స్, ది లేడీ కిల్లర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని పొందాడు.ప్రస్తుతం సింగం 3 లో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. నవంబర్ 1 న ఆ మూవీ విడుదల కాబోతుంది.
రీసెంట్ గా ముంబై లో జరిగిన దివాళి వేడుకలకి అర్జున్ కపూర్ హాజరయ్యాడు. అందులో ఒక విలేకరి అర్జున్ కపూర్ తో మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడిగితే నేను సింగిల్ గానే ఉన్నాను, పైగా చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో చాలా రోజుల నుంచి ప్రముఖ నటి, డాన్సర్ అయినటువంటి మలైకా అరోరా(malaika arora)అర్జున్ కపూర్ లు విడిపోయారని వస్తున్న వార్తలు నిజమని తేలింది.
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా ఆ తర్వాత అతని నుంచి విడిపోయి అర్జున్ కపూర్ తో చాలా కాలం డేటింగ్ చేసింది.తన కంటే వయసులో పన్నెండేళ్ళు పెద్దదైన మలైకా తో డేటింగ్ చెయ్యడం పై అర్జున్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇద్దరు కలిసి బహిరంగగానే చాలా పార్టీలకి హాజరయ్యారు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక సాంగ్ లో మలైకా చేసిన డాన్స్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
