‘దేవర’లో జాన్వీ అలా చేసిందేమిటి?.. బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
on Oct 4, 2024
అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఇష్టపడని భారతీయుడు ఉండరు. ఎందుకంటే ఆమె నార్త్ నుంచి సౌత్ వరకు అందరి అభిమాన హీరోయిన్. అందుకే ఆమెను ఆలిండియా స్టార్ అంటారు. అలాంటి హీరోయిన్ కుమార్తె.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఏర్పడడం సహజం. ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేయడం ద్వారా నార్త్‌లో పాపులర్ అయిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి రిలీజ్ అయ్యే వరకు జాన్వీని బాగా హైలైట్ చేశారు. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. అయితే సినిమాలో తన శక్తి మేరకు అందాలను ఆరబోసే ప్రయత్నం చేసింది.
ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంతగా ప్రాధాన్యం లేని పాత్రను జాన్వీకి ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, సినిమాలో ఆమె ప్రజెన్స్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉండడం అందర్నీ నిరాశపరచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్న మాటలివి. అయితే దీనికి విరుద్ధంగా ఓ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అనన్య పాండే.
సోషల్ మీడియాలో అనన్య పాండేకి ఎంతటి ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే. ఏదో ఒక కంటెంట్‌తో తన పోస్ట్ వైరల్ అయ్యేలా చేస్తుంది అనన్య. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘కంట్రోల్’ చిత్రం ప్రమోషన్స్‌లో ఉంది. అందులో భాగంగా ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ప్రస్తావన వచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ‘కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం చాలా కష్టం అని నా అభిప్రాయం. అయితే అందరూ అది చాలా ఈజీ అనుకుంటారు. ఎందుకంటే హీరోతో రొమాంటిక్ సీన్స్‌కి, సాంగ్స్‌కి మాత్రమే హీరోయిన్ పాత్ర పరిమితమై ఉంటుంది కాబట్టి అలా అనుకోవచ్చు. కానీ, అలాంటి క్యారెక్టర్ చెయ్యడం చాలా కష్టం. జాన్వీ విషయానికి వస్తే ‘దేవర’ చిత్రంలో చాలా అద్భుతంగా నటించింది. ‘చుట్టమల్లే..’ సాంగ్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి నేను ఫిదా అయిపోయాను. ఓ పక్క డాన్స్ చేస్తూనే డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం అనేది జాన్వీ వల్లే అయింది’ అంటూ జాన్వీ కపూర్ పెర్‌ఫార్మెన్స్‌పై తన ఒపీనియన్ చెప్పింది అనన్య. జాన్వీపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎందుకంటే తొలిసారి తెలుగులో సినిమా చేసిన జాన్వీ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది వైరల్ అవుతోంది. ఇక అనన్య చెప్పిన విషయాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ఆమె మాటలు కూడా వైరల్‌గా మారిపోయాయి.
Also Read