అమీర్ ఖాన్ పశ్చాతాపం..ఫ్యాన్స్ మాత్రం షాక్
on Feb 24, 2025
ఇండియన్ సినిమా గర్వించదగ్గ హీరోల్లో అమీర్ ఖాన్(Amir Khan)కూడా ఒకరు.ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషిస్తు ఎంతో మంది అభిమానులని సంపాదించాడు.ఇటీవల నిర్వహించిన 60 అండ్ నాట్ డన్ ,ది స్క్రీన్ అండ్ స్పాట్‌లైట్ అనే సెషన్‌లో అమీర్ ఖాన్ తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం జరిగింది.
ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడుతు 'నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే,ఎంతో బాధతో వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను.మూవీ కి సంబంధించి,మనం చేసిన తప్పులేంటని చిత్రబృందంతో చర్చించి, ప్రేక్షకులు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుని వాటిని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటాను.‘మనం చేసిన తప్పులేంటని తెలిస్తే.. తర్వాత చెయబోయే సినిమాల్లో తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. అప్పుడు సెట్స్ లో నేను ఉత్సాహంగా నటిస్తాను.'లాల్ సింగ్ చడ్డా'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’సినిమాల్లో నేను బాగా నటించాను.
కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు ఫలితాలను అందుకోలేక పోయాయి. అలాంటికష్ట కాలంలో నా కుటుంబం నాకు తోడుగా నిలిచిందని అమీర్ చెప్పుకొచ్చాడు.అమీర్ ప్రస్తుతం సితారే జామీన్ ఫర్ అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు 'లాహోర్ 1947 'అనే సినిమాకి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
