అమీర్ ఖాన్ మూడో పెళ్లి!
on Aug 26, 2024
భారతీయ చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న హీరో అమీర్ ఖాన్(amir khan)మూడున్నర దశాబ్డల పై నుంచి తన అద్భుతమైన నటనతో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.పైగా ఇండియా వైడ్ గా సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. లేటెస్ట్ గాఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులోని సమాధానాలతో అందరిలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రముఖ హీరోయిన్ రియా చక్రవర్తి(rhea chakraborty)నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. అందులో తన వ్యక్తి గత జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బంధం ఏదైనా సరే సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఇద్దరి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. విడాకులు తీసుకున్నప్పటకి నా ఇద్దరు భార్యలతో ఇప్పటకే మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఇప్పటికీ వాళ్ళు తన కుటుంబంలో భాగమే అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలని రియా అడిగింది. దాంతో అమీర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.వైవాహిక బంధానికి సంబంధించి నేను రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. కాబట్టి నన్ను అడగకపోవడమే మంచిది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడను. నా కంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా.ఒకరితో కలిసి ఉండటం. ఇష్టా ఇష్టాలు, కష్ట సుఖాలు వారితో పంచుకోవడం నాకు ఇష్టం అని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో అమీర్ మూడో పెళ్లి చేసుకుంటాడా అనే చర్చ అందరిలో మొదలయ్యింది.
కాకపోతే ఇదే ఇంటర్వ్యూ లో ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. మళ్ళీ పెళ్లంటే కష్టంగా ఉంది. ప్రస్తుతం నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.నా పిల్లలు, స్నేహితులతో రీ కనెక్ట్ అయ్యా. నా కెంతో ఇష్టమైన వారితో సంతోషంగా ఉన్నాను. కాకపోతే నన్ను నేను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు ప్రయతిస్తున్నాని చెప్పుకొచ్చాడు. దీంతో అమీర్ చేసే ఈ వ్యాఖ్యలన్నీ మూడో పెళ్ళికి దారి తీసే పరిస్థితులని సూచిస్తున్నాయని పాన్ ఇండియా ప్రేక్షకులు అంటున్నారు. అమీర్ మాజీ భార్యల పేర్లు రీతూ, కిరణ్ రావు.
Also Read