దక్షిణాది దర్శకుడు ఇబ్బందిగా వ్యవహరించాడంటున్న ఉపాసన సింగ్..ఈ హీరో సినిమానే
on Jan 3, 2025
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ కామెడీ నటుడు కపిల్ శర్మ(kapil sharma)హోస్ట్ గా వ్యవహరించే 'ది కపిల్ శర్మ టాక్ షో' కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఎంతో మంది సినీ సెలబ్రటీస్ ఆ షో కి వచ్చి ప్రొఫెషనల్ పరంగాను,పర్సనల్ గాను తాము ఎదుర్కున్న అనుభవాలని ప్రేక్షకులతో పంచుకుంటు ఉంటారు.ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ కి ప్రముఖ నటి ఉపాసన సింగ్(upasana singh)వచ్చింది.
ఆ ఎపిసోడ్ లో ఆమె మాట్లాడుతు అనిల్ కపూర్ హీరోగా ఒక దక్షిణాది దర్శకుడు సినిమాని ప్లాన్ చేసి నన్ను హీరోయిన్ గా ఫైనల్ చేసాడు.అగ్రిమెంట్ పై సంతకం కూడా చేశాను.ఇక ఆ తర్వాత మూవీకి సంబంధించిన ప్రతి మీటింగ్ కి మా అమ్మని,చెల్లిని తీసుకువెళ్లే దాన్ని.దాంతో ప్రతి మీటింగ్ కి వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావని ఆ దర్శకుడు అడిగే వాడు.ఒక రోజు రాత్రి పదకొండు తర్వాత ఫోన్ చేసి సిట్టింగ్ కోసం హోటల్ కి రమ్మని చెప్పాడు.రేపు ఉదయం వస్తానని నేను అనగానే సిట్టింగ్ అంటే అర్ధం తెలియదా అని కోప్పడ్డాడు.ఆ తర్వాత ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లి అందరి ముందే ఆ దర్శకుడ్ని తిట్టాను.దీంతో వేరే వాళ్ళని హీరోయిన్ గా తీసుకున్నాడు.
సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ప్రేమ పావురాలు లో కూడా నన్నే ఫస్ట్ హీరోయిన్ గా తీసుకున్నారు.కానీ సల్మాన్ కంటే ఎక్కువ హైట్ ఉన్నానని తొలగించారని చెప్పుకొచ్చింది. డర్,లోఫర్,భీష్మ,బాదల్,హంగామ,హల్ చల్,డిస్కో కింగ్, బబ్లీ బౌన్సర్ వంటి పలు చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించి మంచి గుర్తింపు ని పొందింది.