సల్మాన్ ఖాన్ ఇంటికి మహర్దశ
on Jan 7, 2025
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan)ప్రస్తుతం 'సికందర్'(Sikandar)అనే మూవీ చేస్తున్నాడు.ఏఆర్ మురుగదాస్(Ar murugadas)దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక(Rashmika)కధానాయికగా చేస్తుండగా కాజల్ అగర్వాల్,సత్య రాజ్,షర్మాన్ జోష్,నవాబ్ షా తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్ లో కూడా ఈ చిత్రం షూటింగ్ ని జరుపుకుంది.సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాజిద్ నడియావాలా నిర్మాత.మార్చి 28 న రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
సల్మాన్ పర్సనల్ విషయానికి వస్తే కొన్ని నెలల క్రితం గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi)నుంచి సల్మాన్ కి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.దీంతో కేంద్ర ప్రభుత్వం సల్మాన్ కి 'వై' కేటగిరి భద్రత కూడా ఏర్పాటు చేసింది.ఇక రీసెంట్ గా సల్మాన్ తన ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో కప్పేస్తున్నాడు. ఇద్దరు కార్మికులు సల్మాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని ఫిక్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఇప్పటికే ఒక బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా కొనుగోలు చేసాడు. దుబాయ్ నుంచి రెండు కోట్ల ఖర్చు పెట్టి ఆ కారుని తెప్పించాడనే టాక్ వినపడుతుంది.
ఇక సికందర్ షూటింగ్ జరిగే లొకేషన్ లోకి కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరి పంపిస్తున్నారు.అపరచియస్తులని షూటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లోకి కూడా అనుమతి చెయ్యడం లేదు.సికందర్ లో సల్మాన్ డ్యూయల్ రోల్ అనే టాక్ ఉంది.