బట్టలు జారిపోకుండా ఉండటానికే దణ్ణం..బాంబు పేల్చిన ప్రియాంక చోప్రా
on Sep 18, 2024
.webp)
ప్రియాంక చోప్రా(priyanka chopra)ఎంత అందంగా ఉంటుందో తన నటన కూడా అంతే అందంగా ఉంటుంది.దాదాపుగా బాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోల సరసన నటించిన ప్రియాంక రీసెంట్ గా తన భర్త నిక్ లండన్ లోని ఎరినా మైదానంలో నిర్వహిస్తున్న కచేరి కి వెళ్ళింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎరినా వేదికపై జరిగిన మిస్ వరల్డ్ పోటీల్ని నా జీవితంలో మర్చిపోలేను.అప్పట్లో దీన్ని మిలీనియం డోమ్ అని పిలిచేవారు. పోటీలో గెలవడం కోసం అందమైన డ్రెస్,హీల్స్ వేసుకొని ఎంతో ఉద్వేగభరితంగా ,ఉత్సాహంగా నా వంతు ప్రయత్నం చేశాను.శరీరంలోని ప్రతి నరం టెన్షన్ పడటమే కాకుండా భయానికి చెమటలు కూడా పట్టాయి. మరో వైపు ధరించిన దుస్తులు కూడా సౌకర్యంగా అనిపించలేదు.పైగా అవి ఎక్కడ జారిపోతాయో అనిపించింది. అందుకే వాటిని పట్టుకుంటూ నమస్తే చేశాను.మీరు గూగుల్ కి వెళ్లి ఆ ఫొటోస్ చూస్తే నేను కృతజ్నతతో నమస్కారం చేస్తునట్టుగా ఉంటాయి. కానీ నా దుస్తులు జారిపోకుండా ఉండటమే నమస్తే వెనుక ఉన్న ఉద్దేశ్యం అని చెప్పింది.

ప్రియాంక చోప్రా పద్దెనిమిది సంవత్సరాల వయసులో 2000 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్ని మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ 2 కి సంబంధించిన సిరీస్ లో చేస్తుంది.ఆమె భర్త నిక్(nick)అమెరికా లోనే ఫేమస్ పాప్ సింగర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



