గర్భ నేర్చుకున్న కియారా
on Jun 19, 2023
కియారా అద్వానీ, కార్తిక్ ఆర్యన్ కలిసి నటిస్తున్న సినిమా సత్య ప్రేమ్ కీ కథ. ఈ నెల 29న విడుదల కానుంది ఈ సినిమా. భూల్ భులయ్యా2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కియారా అద్వానీ, కార్తిక్ ఆర్యన్ నటించిన సినిమా సత్య ప్రేమ్ కీ కథ. ఫిల్మ్ పోస్టర్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించాయి. మ్యూజికల్ లవ్ స్టోరీ అని ఫిక్సయ్యారు జనాలు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గర్భ నృత్యం నేర్చుకున్నారట కియారా. ఆమె కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ నృత్యం చేశారట. ఈ చిత్రంలో రెండు చోట్ల ఆమె నృత్యాన్ని ప్రదర్శిస్తారట. చెప్పులు లేకుండా ఆమె చేసిన నృత్యానికి సెట్లో అందరూ ఫిదా అయ్యారట. ఇప్పటికి విడుదలైన పాటల్లో ఆమె ఎనర్జీ అద్భుతం అంటూ పొగుడుతున్నారు నెటిజన్లు. సినిమాలో ఫస్ట్ పాట ప్లే అవుతున్నప్పుడే హీరో, హీరోని చూస్తారట. ఇందులో రెండో పాట డ్యూయట్. గర్భ పాటల కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ చేశారట. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు పాటలను, హెవీ కాస్ట్యూమ్స్ తో ఆ మె ఫినిష్ చేసిన తీరు సూపర్బ్ అంటోంది యూనిట్.
ఈ రెండు పాటలూ సినిమాకి హైలైట్ అవుతాయన్నది టాక్. జాతీయ అవార్డు గ్రహీత సమీర్ విద్వాంస్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. నదియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, నమః పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుప్రియా పాథక్ కపూర్ ఇందులో కార్తిక్ ఆర్యన్‌కి తల్లి పాత్రలో కనిపిస్తారు. గజ్‌రాజ్ రావు తండ్రి పాత్ర పోషించారు. ఆల్రెడీ సక్సెస్ మీదున్న కియారా అద్వానీ ఓ వైపు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే, రామ్ చరణ్ మూవీలో కీ పోర్షన్ కంప్లీట్ చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారట.