పార్ట్ 2 లో దీపికా పదుకునే చేస్తుంది.. రేంజ్ అంటే ఇది
on Sep 27, 2025

భారతీయ సినీ యవనిక పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించే హీరోయిన్స్ లో 'దీపికా పదుకునే'(Deepika Padukone)కూడా ఒకరు. స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని రేంజ్ ఆమె సొంతం. ఇటీవల దీపికా ని సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్(Prabhas)ల స్పిరిట్, కల్కి పార్ట్ 2 నుంచి తప్పించడం జరిగింది. కాల్షీట్ల విషయంలో దీపికా చెప్పిన కండిషన్స్ అందుకు ప్రధాన కారణమనే ప్రచారం కూడా జరిగింది. కారణాలు ఏమైనా కానీ, దీపికా భారీ ఆఫర్స్ ని మిస్ చేసుకుందని, కెరీర్ కి నష్టం చేకూరే అవకాశం ఉందనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపించాయి. కానీ ఇప్పుడు దీపికా ఒక భారీ ఆఫర్ ని చేజిక్కించుకుందనే న్యూస్ వరల్డ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దీపికా 2017 లో 'ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'లో చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హాలీవుడ్ టాప్ హీరో 'వీన్ డీసెల్'(Vin Diesel)తో జత కట్టి, భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ సినిమాకి చాటి చెప్పింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా దీపికాని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మేకర్స్ ఈ మేరకు దీపికా ని సంప్రదిస్తే,ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. పైగా చిత్ర యూనిట్ తో తన కూతురుకి దగ్గరగా ఉండాలని కోరడంతో ముంబై లోనే షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ఓకే చెప్పినట్టుగా కూడా టాక్.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. దీంతో దీపికా మరో సారి అంతర్జాతీయ యవనిక పై తన సత్తా చాటుతున్నట్టయింది. దీపికా ఖాతాలో అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ, సన్ పిక్చర్స్ ల భారీ ప్రాజెక్ట్ ఉన్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



