ENGLISH | TELUGU  

ప్రధాని మోదీ వల్ల అక్షయ్ కుమార్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ.. బ్రిటిష్ వాళ్ళు క్షమాపణలు చెప్తారా!  

on Apr 15, 2025

బాలీవుడ్ అగ్రహీరో 'అక్షయ్ కుమార్'(Akshay Kumar)ఈ నెల 18 న హిస్టారికల్ కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన 'కేసరి చాప్టర్ 2'(Kesari Chapter 2)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మన దేశ స్వాతంత్య్రానికి పూర్వం 1913 ఏప్రిల్ 13 న పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ పట్నంలో ఉన్న 'జలియన్ వాలాబాగ్'(Jallianwala Bagh)అనే చారిత్రాత్మక గార్డెన్ లో మన వాళ్ళు ఎటువంటి ఆయుధాలు లేకుండా సుమారు 1500 మందికి పైగా సమావేశమయ్యారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు అకస్మాత్తుగా దాడి చేసి అత్యంత కిరాతకంగా మన వాళ్ళని  ఊచకోత కోసి చంపడం జరిగింది. ఈ ఘటనలో సుమారు 1000 మందికి పైగా చనిపోగా ఎంతో మంది క్షత్రగాత్రులుగా మిగిలారు. ఈ సంఘటనపై బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 'శంకర్ నాయర్' అనే లాయర్ పోరాడాడు. ఈ శంకర్ నాయర్ జీవిత కథ ఆధారంగానే కేసరి చాప్టర్ 2 తెరకెక్కగా అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ లో చేస్తున్నాడు.

రీసెంట్ గా మన దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ'(Narendra Modi)తన 'హరియాణా' రాష్ట్ర పర్యటనలో శంకర్ నాయర్(Shankar Nair)గురించి ప్రస్తావిస్తు మీలో చాలా మందికి శంకర్ నాయర్ గురించి తెలియదు. ఆయన చాలా గొప్ప విలువలు కలిగిన న్యాయవాది. 'జలియన్ వాలాబాగ్' ఊచకోత పై బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించి బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలేలా చేసాడు. శంకర్ గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మోదీ మాట్లాడిన స్పీచ్ తాలూకు వీడియోని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ స్పీచ్ వైరల్ గా మారింది.అనంతరం మోదీ కి ధన్యవాదాలు చెప్తు 'శంకర్ నాయర్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు మోదీజీ. మన గురించి పోరాడిన వాళ్ళని గుర్తుపెట్టుకొని గౌరవించడం మన ధర్మం. ముఖ్యంగా యువతరం వీరిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేసరి చాప్టర్ 2 ని తెరకెక్కించాం. బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా 'కేసరి చాప్టర్ 2 ' ని చూసీ తమ తప్పు తెలుసుకొని మనకి క్షమాపణలు చెప్పాలని కూడా అక్షయ్ తెలిపాడు. 'కరణ్ సింగ్ త్యాగి'(karan SIngh Thyagi)దర్శకత్వంలో  కేసరి చాప్టర్ 2 తెరకెక్కగా కరణ్ జోహార్, అరుణ్ భాటియా, హిర్రో యాష్ జోహార్, అమృత్ పాల్ సింగ్ బింద్రా మరికొంత మంది భాగస్వామ్యంతో నిర్మించారు. ఆర్ మాధవన్, రెజీనా కసాండ్రా,(Regina Cassandra)అనన్య పాండే(Ananya Panday)ఇతర ముఖ్యపాత్రల్ని పోషించారు.

 

 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.