అగ్ర హీరోపై 100 కోడిగుడ్లతో అమ్మాయిల దాడి.. ఆలస్యంగా నిజం బయటకి
on Nov 4, 2025

-దాడి ఎందుకు జరిగింది!
-అక్షయ్ కుమార్ చరిష్మా ప్రత్యేకం
-అలాంటి నటుడిని చూడలేదు
-చిన్ని ప్రకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
బడా బడా హీరోలని సైతం తట్టుకొని భారతీయ చిత్ర పరిశమ్రలో తన కంటు ఒక అధ్యాయాన్ని రాసుకున్న హీరో 'అక్షయ్ కుమార్(Akshay Kumar). యాక్షన్, అండ్ కామెడీ జోనర్స్ లో అక్షయ్ కి తిరుగులేదు. మూడున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతున్న తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. కొంత కాలం నుంచి వరుస పరాజయాలని చవిచూస్తున్నాడు. ఇటీవల కన్నప్పలో శివుడి గా నటించి అలరించిన అక్షయ్ పలు కొత్త చిత్రాల షూటింగ్ ల తో బిజీగా ఉన్నాడు.
రీసెంట్ గా అక్షయ్ కుమార్ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాష్(Chinni Prakash)మాట్లాడుతు అక్షయ్ కుమార్ చాలా అంకిత భావం గల నటుడు. తన క్యారక్టర్ బాగా రావడం కోసం వంద శాతం కష్టపడతాడు. నేను అక్షయ్ తో కలిసి సుమారు 50 చిత్రాల వరకు పని చేసాను. వాటిల్లో ఖిలాడి చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంలోని ఒక సాంగ్ కోసం అక్షయ్ అమ్మాయిల చేత 100 కోడిగుడ్లని తన శరీరంపై వేయించుకున్నాడు.చుట్టూ ఉన్న అమ్మాయిలు కొంచం దూరం నుంచే కోడిగుడ్లని విసిరేస్తారు. ఆ సమయంలో నొప్పి కలిగినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత దుర్వాసనని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అంతటి అకింత భావం గల హీరోని నేను చూడలేదని చిన్నిప్రకాష్ చెప్పుకొచ్చాడు.
Also read: ఏం వండుతున్నారయ్యా!.. చికిరి చికిరి చరణ్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖిలాడి(Khiladi)1992లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఖుద్ కో క్యా సంజిత్ హై అనే సాంగ్ లో అక్షయ్ కుమార్ ని హీరోయిన్ అయేషా జుల్కా తో పాటు ఇంకో పది మంది అమ్మాయిలు కోడిగుడ్లతో కొడతారు. అబ్బాస్ మస్తాన్(Abbas Mustan)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



