శ్రీదేవి కూతురుపై అమీర్ ఖాన్ కీలకవ్యాఖ్యలు..కొడుకు జునైద్ నే హీరో అంట
on Jan 7, 2025
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్(Janhvi Kapoor),ఖుషి కపూర్(Kushi Kapoor)సినిమా హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇద్దరిలో జాన్వీ అయితే ముందుగా సినీ అరంగ్రేటం చేసి ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వస్తుంది.లేటెస్ట్ గా తెలుగులో ఎన్టీఆర్(Ntr)తో కలిసి 'దేవర' లో నటించిన జాన్వీ ఇప్పుడు 'రామ్ చరణ్'(Ram Charan)తో కూడా చేస్తుంది.ఇక ఖుషి అయితే 2023 లో 'ది ఆర్చీస్' అనే చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.ఇప్పుడు మళ్ళీ 'లవ్వప్ప'(Loveyapa)అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్(Aamir Khan)తనయుడు జునైద్ ఖాన్(Junaid Khan)హీరోగా చేస్తున్నాడు.ఫిబ్రవరి 7 న విడుదల కానున్న ఈ మూవీకి అమీర్ ఖాన్ నే నిర్మాత.రీసెంట్ గా ఆయన 'లవ్వప్ప' గురించి మాట్లాడుతు మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.రషెస్ చూసాను.చాలా బాగా వచ్చింది.వినోదాత్మకంతో పాటు సందేశాత్మకంతో కూడిన అంశాలతో కూడా ఈ చిత్రం రూపొందింది.సెల్ ఫోన్ కారణంగా మన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది చాల చక్కగా చూపించారు.ఖుషికపూర్ పెర్ ఫార్మెన్సు చూస్తుంటే తన తల్లి శ్రీదేవి గుర్తుకొచ్చింది.శ్రీదేవి స్క్రీన్ పై ఎంత ఎనర్జీతో కనిపించేదో మనకి తెలిసిందే. ఖుషి కూడా అంతే ఎనర్జీ తో కనిపించిందని చెప్పుకొచ్చాడు.
2022 లో ప్రదీప్ రంగనాధన్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన 'లవ్ టుడే' కి రీమేక్ గా 'లవ్వప్ప' తెరకెక్కింది.'లవ్ టుడే' తెలుగులో కూడా రిలీజయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.