ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో రిలేషన్‌షిప్‌లో జాక్వలిన్? ఫొటో వైరల్!
on Nov 27, 2021
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో కలిసున్న ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ వార్తల్లో నిలిచింది. ఆ ఫొటోలో ఇద్దరూ సన్నిహితంగా ఉండటమే కాకుండా, జాక్వలిన్ బుగ్గపై సుఖేశ్ ముద్దుపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ఫొటో తీసింది ఎవరో కాదు, స్వయంగా సుఖేశ్. మిర్రర్ సెల్ఫీగా దాన్ని అతను క్లిక్‌మనిపించాడు. సుఖేశ్ ముద్దు పెడుతుంటే జాక్వలిన్ పులకరించిపోతున్నట్లుగా ఉంది.
ఇండియా టుడేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఫొటో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య తీసింది. అప్పుడు తిహార్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చాడు సుఖేశ్. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, చెన్నైలో జాక్వలిన్‌ను నాలుగుసార్లు సుఖేశ్ కలిశాడు. తమ మధ్య సమావేశాల నిమిత్తం ఆమెకోసం ఒక ప్రైవేట్ జెట్‌ను కూడా అతను ఏర్పాటుచేశాడు.
మిలియనీర్ అయిన సుఖేశ్ చంద్రశేఖర్ ఆర్థిక దోపిడీలకు పాల్పడ్డాడు. జాక్వలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి లాంటి సెలబ్రిటీలు సహా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నుంచి వందల కోట్ల రూపాయల మేర దోపిడీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ పలుమార్లు జాక్వలిన్‌కు సమన్లు పంపింది.
సుఖేశ్ జైలులో ఉండేటప్పుడు జాక్వలిన్‌కు ఫోన్లు చేస్తూ, చాక్లెట్లు, పువ్వులు పంపేవాడని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం జాక్వలిన్‌కు తనెవరనే విషయాన్ని సుఖేశ్ దాచిపెట్టి, తిహార్ జైలు నుంచి కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా ఆమెకు కాల్ చేసేవాడు. అతని ఆర్థిక మోసాల రాకెట్‌లో జాక్వలిన్ బాధితురాలయ్యే అవకాశం ఉందని ఇదివరకు ఇండియా టుడే రిపోర్ట్ తెలిపింది.
Also Read