ఆ ఫ్యామిలీకి బహుమతి ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలి!
on Mar 12, 2024
మన దేశంలో సంపన్నుల పెళ్లిళ్ళు, ఇతర వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లికి ముందు జరిగే కొన్ని వేడుకలకు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. ప్రస్తుతం దేశమంతా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఎంతో ఆట్టహాసంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. కొందరు స్టేజ్ మీద పాటలు పాడి, డాన్సులు చేసి అందర్నీ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు లక్షమందికి విందు భోజనం వడ్డించారు. అందులో కొంతమంది ముఖేష్ స్వయంగా వడ్డించడం విశేషం. ఈ ఫంక్షన్‌కి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ ఫంక్షన్ కోసం జామ్ నగర్‌లో రెండు రోజులపాటు సెటిల్ అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై పెళ్ళి చేసుకోబోతున్న అనంత్, రాధికలకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ స్టార్ మీరో సల్మాన్‌ఖాన్‌కి అంబాని కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. సల్మాన్, అనంత్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతారు. అందుకే తన స్నేహితుడి ప్రీ వెడ్డింగ్‌కి ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు సల్మాన్. అతని కోసం ప్రత్యేకంగా ఓ ఖరీదైన వాచ్‌ను తయారు చేయించాడు. ఆ వాచ్ విలువ కోట్లల్లో ఉంటుందని సమాచారం. అలాగే రాధిక మర్చంట్‌కు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడు. ఈ బహుమతులపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని కోట్లు పెట్టి బహమతులు తెచ్చినా అవి అంబానీ కుటుంబానికి నథింగ్ అనీ, వారిని శాటిస్‌ఫై చేసే బహుమతి ఇవ్వాలంటే దేశంలోని కోటీశ్వర్లు వారి ఆస్తులు అమ్ముకోవాలని కొందరు అంటుంటే.. ఎవరి తాహతుకు తగ్గ బహుమతి వారు ఇస్తారు.. ఆ బహుమతిలో వారి ప్రేమ, అభిమానం కనిపిస్తుంది తప్ప అది ఎంత విలువ చేస్తుంది అనేది కాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read