పిల్లల చదువు ఖర్చులు నావి.. మిగతా ఖర్చులన్నీ మా ఆయనవి!
on Dec 1, 2021
కుటుంబ ఖర్చులను తను, తన భర్త అక్షయ్ కుమార్ ఎలా షేర్ చేసుకుంటారో వెల్లడించింది నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా. పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులన్నీ తనే పెట్టుకుంటానని ఆమె చెప్పింది. అక్షయ్, ట్వింకిల్ 2001లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.. కొడుకు ఆరవ్, కూతురు నితార. తన చిన్నప్పుడే సొంత కాళ్లపై నిలబడాలని తనకు అమ్మ డింపుల్ కపాడియా చెప్పిందనీ, దాన్ని తాను ఆచరిస్తూ వస్తున్నానని ట్వింకిల్ తెలిపింది.
కాజోల్ తన 'ట్వీక్' ఇండియా యూట్యూబ్ చానల్ కోసం ట్వింకిల్ ఖన్నాను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా కాజోల్ తన కెరీర్‌లో కొంత సంపాదించి వుంటుంది కాబట్టి, వారి ఖర్చుల్ని కాజోల్, అజయ్ దేవ్‌గణ్ ఎలా హ్యాండిల్ చేస్తుంటారోనని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. "నీ లైఫ్‌లో ఎక్కువ కాలం నువ్వు సినిమాల్లో పనిచేశావు. కాబట్టి నువ్వు సొంతంగా కొంత సంపాదించి వుంటావ్. మీరు ఖర్చుల్ని విభజించుకుంటారా? ఖర్చులు ఎవరు పెట్టుకుంటూ ఉంటారు? ఉదాహరణకు మా లైఫ్ చూసుకుంటే, పిల్లల స్కూలు, చదువుకు సంబంధించిన ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. ఎందుకంటే అప్పుడే నేను 'మీరు చదువుకుంది నావల్లే'నని వాళ్లకు చెప్పగలుగుతాను. నువ్వు అలా ఏదైనా ఖర్చులు పెట్టుకుంటావా? లేక మొత్తం అజయ్ పెడుతుంటాడా?" అనడిగింది.
దానికి కాజోల్, "లేదు, ఈ విషయంలో మేం చాలా క్లియర్‌గా ఉన్నాం. అజయ్‌ది ఏదైనా నాదే, నాది ఏదైనా నాదే. అఫ్‌కోర్స్ పిల్లలు మాత్రం నావాళ్లే. నిజాయితీగా చెప్పాలంటే ఇది సౌలభ్యాన్ని బట్టి ఉంటుందనుకుంటాను." అని జవాబిచ్చింది. 1999లో కాజోల్, అజయ్ పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.. కూతురు నైసా, కొడుకు యుగ్.
Also Read