హీరోయిన్ ఆత్మహత్యాయత్నం.. మానసిక రుగ్మతే కారణం!
on Sep 21, 2024
కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తారు. అనవసరమైన విషయాల గురించి భయపడుతుంటారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదైనా సమస్య వచ్చినపుడు దాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆందోళన చెందుతుంటారు. అలా క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి మానసిక రుగ్మతలు కొందరికి వంశపారంపర్యంగా వస్తే.. మరికొందరికి పెరిగిన వాతావరణం, పరిస్థితుల వల్ల ఏర్పడతాయి. సాధారణ ప్రజలకు ఈ సమస్య వస్తే ఎవరికీ తెలీదు. అదే ఒక సెలబ్రిటీ ఇలాంటి మానసిక సమస్య కారణంగా బాధపడుతోందని తెలిస్తే క్షణాల్లో ఆ వార్త వైరల్‌గా మారిపోయి ప్రపంచాన్ని చుట్టేస్తుంది.
అలాంటి విచిత్రమైన పరిస్థితి బాలీవుడ్ హీరోయిన్ షమా సికిందర్ జీవితంలో జరిగింది. షమా బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా టీవీ షోల ద్వారా, మ్యూజిక్ వీడియోల ద్వారా ఎంతో పాపులర్ అయింది. అంతేకాదు, వీటితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో అందరికీ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈమె గురించి నెట్టింట్లో ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇంత ఫేమస్ అయిన షమా వ్యక్తిగత జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఆమెకు జన్యుపరమైన ఓ డిసీజ్ ఉండేది. దాదాపు 15 ఏళ్ళ క్రితం తనకు ఇలాంటి డిజార్డర్ ఉందని గుర్తించింది షమా. ఆమెకిది వంశపారంపర్యంగా సంక్రమించింది. అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం, దెయ్యం పట్టినదానిలా ఊగిపోవడం చేస్తుండేది. ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఓసారి ఆత్మహత్యాయత్నం చేసిందట. నిద్ర మాత్రలు మింగి పరిస్థితి విషమించే సమయంలో స్పృహలోకి వచ్చిన ఆమె తను ఉన్న పరిస్థితి గురించి సోదరుడికి మెసేజ్ చేయడంతో అదే ఇంట్లో ఉన్న తల్లికి విషయం తెలియజేశాడతను. దాంతో వెంటనే షమాను ఆస్పత్రికి తరలించారు.
సరైన సమయంలో చికిత్స అందించడంతో షమా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. ఇది జరిగిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తించడంతోపాటు ఒంటరిగా కూర్చొని ఏడవడం, డిప్రెషన్‌కి లోను కావడం వంటి లక్షణాలు కనిపించడంతో దానికి అవసరమైన కౌన్సిలింగ్ ఇప్పించారు. దాంతో క్రమంగా ఆమె మానసికంగా సాధారణ స్థితికి చేరుకుంది. ఆ తర్వాత తన కెరీర్‌పై దృష్టి పెట్టి ఈ స్థాయికి చేరుకుంది. ఇటీవలే షమా గతం గురించి అందరికీ తెలిసింది. ఆమె గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అనే విషయాల గురించి అందరూ చర్చించుకుంటూ ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read