తన ఆరోగ్యం గురించి ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చిన అమితాబ్!
on Mar 16, 2024
మీడియా, సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, అనర్థాలూ అన్నే ఉన్నాయి. ఈ విషయం గతంలో కూడా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. జెన్యూన్‌గా వచ్చే వార్తల మధ్యలో కొన్ని ఫేక్ న్యూస్‌లు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా కొందరు సెలబ్రిటీల ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, వారి పరిస్థితి విషమించిందని, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారనే వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి ఫలానా సెలబ్రిటీ చనిపోయారనే న్యూస్‌ని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు.
తాజాగా ఈ అనుభవం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ఎదురైంది. ఆయన ఆరోగ్యం బాగా లేదని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మార్చి 15న అమితాబ్ అస్వస్థతకు గురయ్యారని, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని ప్రచారం జరిగింది. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడ్డాయని, వైద్యులు చికిత్స చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు అమితాబ్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రచారం జరిగింది. తను ఆరోగ్యంగానే ఉన్నానని అమితాబ్ ఒక వీడియో ద్వారా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే అది ప్రత్యేకంగా తయారు చేసిన వీడియో కాదు.
శనివారం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కలిసి దాదోజీ కొండదేవ్ స్టేడియంకి వచ్చారు అమితాబ్. అక్కడే ఉన్న మీడియాను విష్ చేసి తన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని ఒక్క ముక్కలో చెప్పి స్టేడియంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అమితాబ్ ఆరోగ్యంగా కనిపించిన వీడియోను చూసి అప్పటివరకు ఆందోళనలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read