మూడు రోజులు ఏడిస్తే గాని నా బాధ తగ్గదు
on Oct 9, 2024
యానిమల్(animal)మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించడంతో పాటుగా నేషనల్ క్రష్ గా మారిన నటి త్రిప్తి డిమ్రి(tripti dimri)ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. మొన్నీ ఈ మధ్య బాడ్ న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిప్తి ఇప్పుడు లేటెస్ట్ గా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నెల 11 న విడుదల కాబోతుండగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో త్రిప్తి మాట్లాడుతు యానిమల్ రిలీజ్ అయ్యాక జోయా క్యారక్టర్ చేసినందుకు చాలా మంది నన్ను తిట్టారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కూడా చాలా దారుణంగా ట్రోల్ల్స్ చేసారు. అప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలో అర్ధం లేదు. అసలు అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడు అనుకోలేదు.ఎంతో బాధపడ్డా, మానసికంగా ఆవేదనకి గురయ్యాను, దాని నుంచి బయటకి రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూ కూర్చున్నా. దాంతో కొంచం బాధ తగ్గి మనసు శాంతించింది, ఆ సమయంలో నా సోదరి నాకు సపోర్ట్ గా నిలవడంతో పాటుగా నువ్వేం చేసావో నీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకని దైర్యం చెప్పింది.
ప్రస్తుతం త్రిప్తి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. ఏడు సంవత్సరాల క్రితం సినీ రంగ ప్రవేశం చేసిన త్రిప్తి కి ఇప్పుడు బాలీవుడ్ లో బడా హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. విక్కీ విద్య కా వో వాలా వీడియో లో రాజ్ కుమార్ రావు తో కలిసి చేస్తుంది. రాజ్ కుమార్ రావు(raj kumar rao)ఇటీవల స్త్రీ 2(stree 2)తో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.