'ఆర్యన్ ఖాన్' డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. తెరపైకి 'అనన్య పాండే' పేరు!
on Oct 21, 2021
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షారూఖ్ ఖాన్ ఇంటితో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఇంటిపైనా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు(గురువారం) దాడులు జరిపారు.
సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. షారూక్ పిల్లలు ఆర్యన్, సుహానేకు మంచి ఫ్రెండ్. అయితే ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ డ్రగ్స్ గురించి అనన్యతో వాట్సాప్ ఛాట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో అనన్య ఇంటిలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీఐ అధికారులు.. ఆమె మొబైల్, లాప్ టాప్ లను సీజ్ చేశారని సమాచారం. అలాగే, విచారణకు హాజరు కావాలని తెలుపుతూ నోటిసులు ఇచ్చారు. కాసేపటి క్రితం ఆమె విచారణ కోసం ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
షారూఖ్ ఇంట్లో కూడా ఎన్సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం తన కొడుకు ఆర్యన్ ను కలవడానికి షారూఖ్ జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఇంటికి చేరుకున్న కాసేపటికే ఎన్సీబీఐ అధికారులు షారూఖ్ ఇంటికి చేరుకుని సోదాలు చేశారు.
హీరోయిన్ గా ఎదుగుతున్న టైంలో అనన్య పేరు డ్రగ్స్ కేసులో రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె నిందితురాలు కాదని, కేవలం విచారణలో భాగంగానే సోదాలు నిర్వహించామని అధికారులు అంటున్నారు. అనన్య ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో నటిస్తోంది. దీంతో ఈ అంశం టాలీవుడ్ లోనూ చర్చనీయాంశమైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
