బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం..దిగ్గజ శిఖరం మృతి
on Apr 7, 2024
భారతీయ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లో ఎన్నో అత్యున్నతమైన చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత గంగు రామ్ సే కన్నుమూశారు. నెల రోజులు క్రితం అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటినుంచి ఆయనకీ ట్రీట్ మెంట్ జరుగుతుంది. చివరకి పరిస్థితి విషమించడంతో నిన్న చనిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకి తెలిపారు.
ఇక రామ్ సే నిర్మాతగానే కాకుండా కెమెరామెన్ గా కూడా పని చేసారు. హవేలీ, టేకాన లాంటి హర్రర్ చిత్రాలతో పాటు ఖిలాడీ,ఆషిక్ ఆవారా లాంటి చిత్రాలు ఆయనకి మంచి పేరు తెచ్చాయి. తన సోదరులతో కలిసి సుమారు 50 చిత్రాలకి పైగా నిర్మించారు.ఆయన వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తన విచారాన్ని వ్యక్తం చేసారు.
Also Read