అందరు ఆ పార్టీకే ఓటు వెయ్యండి.. అగ్ర హీరోది ఫేక్
on Apr 17, 2024
హీరోలకి కూడా కామన్ మాన్ లాగా ఓటు హక్కు ఉంటుంది.నచ్చిన పొలిటికల్ పార్టీ కూడా ఉంటుంది.పైగా ఎలాంటి మొహమాటానికి పోకుండా తమకి నచ్చిన పార్టీకి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. కొన్నిరోజుల నుంచి ఒక అగ్ర హీరో విషయంలో అందరు ఇలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ హీరో ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యడం లేదు. పైగా పోలీసు కేసు కూడా నమోదు చెయ్యాల్సిన పరిస్థితి. అసలు ఆ కథ ఏంటో పూర్తిగా చూద్దాం
అమీర్ ఖాన్.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న బిగ్ హీరోస్ లో ఒకరు. ఎన్నో చిత్రాల్లో అధ్బుతంగా నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తను చెప్పిన పార్టీ కి ఓటు వెయ్యమని అమీర్ ప్రజలకి చెప్తున్నటుగా వీడియోలో ఉంది. దీంతో అమీర్ బృందం షాక్ అయ్యింది. ఆ వీడియో ఫేక్ అని ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై సైబర్ క్రైమ్ సెల్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది.అమీర్ ఖాన్ త్వరలోనే ఆ ఫేక్ వీడియో మీద స్పందిస్తారని సదరు బృందం వెల్లడి చేసింది.
ముప్పై సంవత్సరాల తన సినీకెరీర్ లో అమీర్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ కి మద్దతు తెలపలేదు. ఎన్నికలప్పుడు ప్రజలందరు తమ ఓటు హక్కుని వినియోగించు కోవాలని మాత్రమే చెప్తుంటాడు. ప్రస్తుతం తారే జమీన్ పర్ మూవీకి సిక్వెల్ గా వస్తున్న సితారే జమీన్ పర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆయన గత చిత్రమైన లాల్ సింగ్ చద్దా పరాజయాన్ని మూటగట్టుకుంది.
Also Read