Facebook Twitter
కళ్ళు చెప్పే కథలు

కళ్ళు చెప్పే కథలు

- స్వప్న కంఠంనేని


మొదటగా ఒక మనిషి గురించి అతని కళ్ళెం చెబుతాయో చూద్దామా!


* కళ్ళు హృదయాన్ని ప్రతిబింబిస్తాయని అనాది నుంచి ఒక అభిప్రాయం వాడుకలో వుంది.నిజమే కూడా ! ఏ మనిషి గురించి అయినా గానీ అతని కళ్ళు ఎక్కువ రహస్యాల్ని చెబుతాయి.
* ఇద్దరు వ్యక్తులు ఎదురు బొదురుగా  ఉన్నపుడు మాటల ద్వారా కంటే చూపులు ద్వారా ఎక్కువ భావాల్నిమార్పిడి చేసుకుంటారు. కళ్ళు బాహ్య ప్రపంచానికి ముఖద్వారాలే కాక మన అంతర్ ప్రపంచానికి రాజమార్గాలు కూడా!
* కాబట్టి లతాంగీ, నీ పురుషుడి అంతరంగంలో ఏమి దాగి ఉందో తెలుసుకోవడానికి  మొదటగా అతని కళ్ళను చదువు !
* అతని కళ్ళలో నీ పట్ల ఆసక్తి ఉందా, నిర్లక్ష్యం ఉందా? కోపం పొరలు పోతుందా ? మానవత్వం దాగి ఉందా , అద్భుత భావం  పొదిగి ఉందా ?
* ఈ సందర్భంలో  నీకు వాసంతి తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏమని వాపోతుందో తెలియజేస్తాను. ఆమె అంటుంది కదా :
" ప్రకాష్ సంగతి నాకేం అంతుపట్టడం లేదు అతను నావైపే ఆర్తిగా ప్రేమగా చూస్తాడు, అంతవరకు బాగానే వుంది. గాని నేను మాట్లాడుతున్నపుడు మాత్రం అతను ధ్యాస వుంచి వినటం లేదేమో అని అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నపుడు అతను ఎంతసేపు గదిలో ఆ మూలకి ఈ మూలకి అవతల కదులుతున్న మనుష్యుల వైపు చూస్తుంటాడు. ఎప్పుడో  ఒకసారి నా కళ్ళలోకి నేరుగా చూస్తాడు గాని అది ఒక్క క్షణం మాత్రమే. ఎక్కువ సమయాలలో అతను నామీద కంటే నా చుట్టుపక్కల ఉండే పరిసరాల మీద, ఇతర మనుష్యుల మీదా ఎక్కువ ధ్యాస ఉంచుతున్నాడేమో ననిపిస్తుంది.అది నిజమేనా లేక కేవలం నా అనుమానమేనంటారా ?

* పాపం అతని పట్ల అంత మక్కువను పెంచుకున్న వాసంతికి ఏమని చెప్పాలి ?
* మాటిమాటికి ఆమె నుంచి చూపుల్ని తప్పించి చుట్టుపక్కలకు  చూడటం ద్వారా అతను ఆమెపట్ల తనకు నిజమైన ఆశక్తి లేదని స్పష్టంగా  తెలియజేస్తున్నాడు. అతని నుంచి ఆమె ముందే జాగ్రత్త పడటం మంచిది. అదే చెప్పాను.
* మరికొన్ని విషయాలు తెలియజెప్పాక ఆమె నిజంగానే జాగ్రత్తపడి మరో యువకుణ్ణి పెళ్ళాడి ఇప్పుడు సుఖంగా కాపురం చేసుకుంటుంది.

 

చూపుల్తో చూపులు కలిపే చిన్నోడు :

* ఒక యువతి తనతో సంభాషిస్తున్నపుడు నేరుగా ఆమె కళ్ళలోకి చూసే యువకుడు ఆమె పట్ల నిజమైన ఆసక్తి కలిగి వున్నవడై ఉంటాడు.
* తన భావాల్ని , ఉద్వేగాల్ని ఆత్మీయంగా ఆమెకు చెప్పి మళ్ళీ ఆమె నుంచి వాటిని అందుకోవాలని చూస్తాడు. నటన ఏమి లేకుండా నిజాయితీగా, కనీసం ఒక క్షణం అయినా గానీ తానామె పట్ల ఆకర్షితుడై ఉన్నట్లు తెలియజేస్తాడు.  


అనిమేషుడు :

* మరొక యువకుడుంటాడు, తాను ప్రేమించే యువతీ వేపు రెప్పలార్చకుండా చూస్తుంటాడు. మరి అతని మాట ?
* తీరికగా ప్రశాంతంగా కళ్ళలోకి చూసే మనిషికీ రెప్పలార్చకుండా సూటిగా కళ్ళలోకి చూసే మనిషికీ తేడా ఉంటుంది.
* రెప్పలార్చకుండా సూటిగా కళ్ళలోకి చూసే మనిషి మనల్ని శల్యపరీక్ష చేస్తున్నట్లుగా అనిపించి అనీజీగా ఫీలవుతాము! మనలో కలిగేఆ అనీజీ

వాస్తవబద్దమైనదే కూడా!
* తను ప్రేమించే అమ్మాయిని అలాంటి అనీజీకి గురిచేసే పెద్దమనిషిని ఏమనాలి ?!
* వన్ వే ట్రాఫిక్ మహాశయుడు !
* అతడు తన గుచించి ఏమీ తెలియజేసయడు గాని అవతలివాళ్ళ రహస్యాలను మాత్రం తెలుసుకోవాలని చూస్తాడు! ఒకవేళ ఆ అమ్మాయి అతనిలోని

మిగితావిషయాలు నచ్చి అతణ్ణి పెళ్లి చేసుకుందంటే  త్వరలోనే ఆమె అతడు ఏ కెజిబి లోనో, ఏ సిఐఏ లోనో ఉండాల్సిన మానవుడని అనేక విధాలుగాఅతడు తనకు ' చిక్కడు దొరకడు' అనీ అర్ధం చేసుకుంటుంది. 

 

(సశేషం)