Facebook Twitter
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికీ అలాగే తెలుగుని విస్మరించే పతీ ఒక్కరికీ తెలుగు బాష దినోత్సవ శుభాకాంక్షలు! కన్నతల్లి లాంటి తెలుగు బాష ని మరువకండి..... తెలుగు మాట్లాడండి మీ పక్క ఉన్న వాళ్ళతో మాట్లాడించండి
దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు రాయల వారు
తెలుగు మాట్లాడమే పాపం అంటున్నది నేటి మన సమాజం
తెలుగు బాషకి మనం గుర్తింపు తీసుకురాక పోయిన పర్వాలేదు కానీ మర్చిపోయేలా
మటుకు చేయకండి
పరాయి రాష్ట్రాల వారు బాష పై మమకారంతో యుద్దాలు చేస్తున్నారు కానీ మనం
కనీసం మాట్లాడడం కూడా చేయడం లేదు......
ఒక బడిలో తెలుగులో మాట్లాడితే టీచర్ ఆ విద్యార్ధిని ఎండలో నిలబెట్టింది
రోజంతా

***
   

12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.
    అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.
    పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది
    క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.
    క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
    బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.
    ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.
    కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి
    తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

తెలుగువారు అయినందుకు గర్వపడండి....తెలుగువారిగా పుట్టినందుకు సంతోషపడండి..
తెలుగు భాష ఉనికి కోసం పాటుపడండి..తెలుగు భాషావ్యాప్తికి కృషి చెయ్యండి"..!!