Facebook Twitter
తెగిన పేగు

తెగిన పేగు

కొన్ని కథలు జీవితానికి ఎంతో దగ్గరాగా వుంటాయి అవి చదివినపుడు మన మనసు చెమ్మగిల్లితుంది ఆ కథలోని పాత్రలు కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతాయి అలా ఈ మద్యనేను చదివిన ఒకప్పటి కథ నన్ను భలే కలవర పరచింది అప్పటి తరంలో స్త్రీల భాదలను మన ముందుంచే ఆ కథ పేరు " తెగిన పేగు " పీసుపాటి ఉమమహేశం గారు రాసారు. ఆ కథని అనుకోకుండా మొన్న చదివాను నాకు ఎంతో నచ్చింది నిజానికి ఆ కథలోని 'ఫీల్ ' కథని స్వంతంగా చదివితేనే మనసుని తాకుతుంది.

ఎక్కడైనా దొరికితే తప్పకుండ చదవండి. ఇప్పుడు ఆ కథని నేను మీకు పరిచయం చేస్తాను నాగలక్ష్మి గారు కొడుకుని ఓ కోరిక కోరుతుంది కేరళలోని " పాల్ గాట్ " కి తీసుకెళ్ళమని. తల్లి ఎప్పుడు ఏది అడిగింది లేదు ఇన్నేళ్ళలో మొట్టమొదటిసారి పైగా కేరళ కి తీసుకెళ్ళమని అడగగానే కొంత ఆశ్చర్యపోయిన తల్లి కోరిక తీర్చాలనుకుంటాడు కొడుకు. తండ్రి ఎప్పుడో మాటల మద్య చెప్పగా విన్నాడు కేరళలోని " పాల్ గాట్ " తల్లి పుట్టినిల్లు అని, ఇన్నేళ్ళలో ఎప్పుడు ఎవరు అక్కడినుండి ఇక్కడికి వచ్చింది లేదు, వీళ్ళు ఇక్కడనుండి అక్కడికి వెళ్ళిందిలేదు తల్లిని ఆమె పుట్టిన ఊరికి తీసువెళ్ళటానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఆమెకి ఆ ఊరి పేరొకటే తెల్సు అది ఎక్కడ వుందో కూడా తెలియదు మొత్తానికి ఎలాగో ఒకలా ఆ ఊరు చేరుతారు ఇందులో నాగలక్ష్మి గారు పుట్టిన ఊరు కేరళలోని పాల్ గాట్ అయితే ఆమెకి సంవత్సరాలు ఉన్నపుడు కన్యాశుల్కం మిచ్చి పెళ్లి చేసుకుని ఆంధ్రదేశంలోని ఓ మారుమూల పల్లెటూరికి తెస్తాడు ఆమె భర్త .

ఇక్కడ పెద్ద కోడలిగా బరువు బాధ్యతల మద్య తన ఊరు తన వాళ్ళని మర్చిపోతుంది ఈమెకి వాళ్ళ ఊరు పేరు , చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలు లీలగా గుర్తుంటాయి. అక్కడి భాష కూడా ఆమెకి గుర్తుండదు అయితే ఆమె 80 సంవత్సరాల వయసులో కొడుకుని పాల్ గాట్ కి తీసుకు వెళ్ళమని కోరుతుంది.

అష్ట కష్టాలు పడి అ ఊరు చేరాక తమ ఇల్లు ఏదో గుర్తుకు రాదు ఆమె కి.. నాగలక్ష్మి మీ గారికి తమ ఇల్లు ఓ గుడి పక్కన ఉన్నట్టు చిన్న జ్ఞాపకం అదే చెబుతుంది కొడుకుకి , అక్కడి ఓ స్కూల్ టీచర్ కి ఇంగ్లీష వస్తే ఆయనకి తమ సమస్య చెప్పి మొత్తానికి గుడి పక్క ఇల్లు కనుక్కుంటారు ఆ ఇంటికి చేరగానే ఓ ముసలి వ్యక్తీ గుమ్మంలో ఎదురవుతాడు అతనిని తదేకంగా చూస్తూ నువ్వు అప్పువి కదా అంటుంది అవును నువ్వు నా తమ్ముడివి అని ఏదేదో చెప్తుంది కానీ ఒక్క మాట అతనికి అర్ధం కాదు మద్యన స్కూల్ టీచర్ మలయాళం లోకి ఈమె చెప్పినవన్నీ తర్జుమా చేసి ఆ ముసలాయనకి చెబుతాడు.

నాగలక్ష్మి ఒక్క ఉదుటన ఇంట్లోకి వెళ్లి ప్రతీ ప్రదేశాన్ని తాకుతూ, ఏడుస్తూ ఇక్కడ నేను ఆడుకునేదాన్ని ఇక్కడ అన్నలు తినేవాళ్ళం అంటూ ఏవేవో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని చెబుతూ ఇల్లంతా తిరుగుతుంది.వెక్కి వెక్కి ఏడుస్తుంది నాది కానీ ఊరు నా వాళ్ళు లేని జీవితం దేవుడా ఎందుకింత శిక్ష ఆడవాళ్ళకి అంటూ భాదపడుతుంది ఆమె తమ్ముడితో మాట్లాడడానికి అతనికి తెలుగు రాదు, ఆమెకి మలయాళం రాదు కాసేపటికి తన పుట్టింటి వారి గురించి అడిగి తెల్సుకుని తనుపుట్టిన ఇంటిని ఆత్రంగా తడిమి తడిమి చూసుకుని కన్నీళ్ళతో వెనక్కి బయలుదేరుతుంది. ఎప్పుడో 75 ఏళ్ళ క్రితం తెగిన పేగు బంధం భాదగా మూలుగుతుంది ... ఇది ఏ కథ సారాంశం ఏ కథని వింనటం కాదు చదివి తీరాలి. కొన్ని తరాల వెనక ఆడవారి మనసు లోతుల్లోని కన్నీరు మన కళ్ళ వెంట ధారల కారటం కాయం...

- రమ