Facebook Twitter
మాతృదేవోభవ

మాతృదేవోభవ


రచన - ముకుంద ప్రియ
priyamukunda1@gmail.com


"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచంలోనే లేదు. మన తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువైనది మరొకటిలేదు. మనకి దెబ్బ తగిలితే  మొదట వచ్చే మాట "అమ్మ". అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తేనే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే. ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట, రోజు, నెల మట్లాడోచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాం....అదే "అమ్మ ప్రేమ". 

"అమ్మ" అనే మాట ముందు మన "ప్రాణం" అనే పదం చాలా చిన్నది కదా !  కాదని అనగలరా ఎవరైనా ? ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.
 
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ?
ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం?
నిజంగా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం...... మనం ఏమిచ్చిన అమ్మ రుణం మాత్రం తీర్చుకోలెం . అమ్మ అనే మాటలో  ఎంతో తియ్యదనం వుంది ఎంత మాధుర్యం వుందో  రోజంతా ఎంత బిజీగా ఉన్న ఎన్ని టెన్షన్స్ ఉన్న ఒక్క పది నిముషాలు అమ్మతో మాట్లడితే అన్ని మర్చిపోతాం. అమ్మకంటూ వేరే ప్రపంచం లేదు. మననుంచి  ప్రైవసీ కోరుకోదు తల్లికి పిల్లలే సర్వస్వం తను తినకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయిన ఎప్పుడు పిల్లలగురించే ఆలోచిస్తుంది. మన కోసం ఎంత కష్టమైన భరిస్తుంది ఎంత భాదనైన గుండెల్లోనే పెట్టుకుంటుంది. అలాంటి తల్లి కోసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మథర్స్ డే రోజైన కనీసం శుభాకాంక్షలు చెపుదాం...

మదర్స్‌డే’ చరిత్ర ఈనాటిది కాదు! కొన్ని శతాబ్దాలకు ముందునుంచే ఈ మదర్స్‌డేను నిర్వహించినట్టు చారిత్రికాధారాలున్నాయి. ముఖ్యంగా గ్రీకులు దేవతలకే అమ్మగా కొలిచే ‘రెహ’ను పూజిస్తూ ఉత్సవాలు నిర్వహించేవారు. తొలినాళ్ళలో క్రైస్తవులు కూడా ప్రతి నాల్గవ ఆదివారం జీసస్ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు జరుపుకొనేవారు. ఆసక్తి కరంగా తర్వాతి కాలంలో దీన్ని సెలవుగా ప్రకటించడం ఆచారంగా మారింది క్రమంగా దీన్ని ‘మదరింగ్ హాలీడే’గా ప్రకటించారు. 1872లో జులియా వార్‌డ హోవె శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒక రోజును ‘మదర్స్ డే’ గా పాటించడం ప్రారంభించారు. ఇది నేటి ‘మదర్స్ డే’ కి మూలమని చెప్పొచ్చు.

జో కొట్టినా , పాల్లిచ్చినా, భయపెట్టినా, లాలించినా, గోరుముద్దలు తినిపించినా, బల్యంలోనైనా, యవ్వనంలో నయినా,  వృద్ధాప్యంలోనైనా,  భాద్యతలలోనైనా,భాదలలోనైనా, అందరు సంతోషంగాఉండేందుకు అమ్మే ఆధారం. మనస్సాంతికైనా, మమకారములకైనా, కోరికలకైనా, వేడుకలకైనా, సమస్యల పరిష్కారమునకైనా, ఏ విషయాలకైనా, కామధెనువులా, కల్పతరువులా చీకటిని తరిమి వేలుగును అందరికీ పంచుటానికి   అమ్మే ఆధారం. అరమరికలు లేకుండా  ఫ్యామిలి లో అందరు హ్యాపీ వుండేలా అందరి మన్ననలను పొందటం ఎలానో  మనం అమ్మని చూసే నేర్చుకోవాలి. ఆత్మీయులను కలుపుకు పోవటం కాని  అసాధ్యన్ని సుసాధ్యము చేయుటానికి  కాని  అమ్మే ఆధారం.

అమ్మ లేకుండా మనం ఈ సృష్టినే ఉహించుకోలెం.మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే, అమ్మ లేకపోతే మనము లేము, ఈ సృష్టి లేదు.అమ్మ మనసు గురించి ఎందరో కవులు ఎన్నో కవితలు, కథలు వ్రాసారు, ఒకరు "పెదవి పలికే మాటల్లో తీయని మాటే 'అమ్మ' " అంటే మరొకరు "ఎవరు వ్రాయ గలరు 'అమ్మ' అను మాటకన్న తీయని మాట" అని.....అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అసలు నా  ఫీలింగ్స్ చెప్పడానికి భాషే సరిపోవడం లేదు, ఎన్ని చెప్పిన ఇంకా ఏదో  చెప్పాలని, ఏదో మర్చిపోయననే అనిపిస్తుంది నాకు, అమ్మే నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మే నాకు అన్ని ఈ ప్రపంచంలో ఏమిలేకపోయిన నేను బ్రతుకుతాను బ్రతకగలను కాని అమ్మలేకుండా మాత్రం ఒక్క నిముషం కూడా ఉహించుకోలేను కనీసం ఆ ఆలోచన కూడా రానివ్వను నేను మళ్ళీ  పుడతానో లేదో తెలిదు కాని పుడుతె మాత్రం మా అమ్మకే పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

మమల్ని మోసి కని, పెంచి మా అల్లర్నిభరించి మా తప్పులని సరిదిద్ది మా నుంచి ఏమి ఆశించని నిస్వార్ధ మాతృమూర్తులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూన్నాం....మా తల్లులందరికి మథర్స్ డే శుభాకాంక్షలు.....