Facebook Twitter
" ఏడు రోజులు " పార్ట్ -2

" ఏడు రోజులు " పార్ట్ -2

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

భవానిశంకర్ కి నవ్వొచ్చింది చిన్నగా నవ్వుతూ తల్లి ముందుకు వెళ్ళి మునివేళ్ళపై కూర్చుని, "అవునమ్మా!  ఒక్క కొడుకుని సాకడానికే

నువ్వుఇంత కష్టంగా మాట్లాడితే, ఆ ఇదురింటి సాయిబుకి ఏడుమంది ఆడపిల్లలు, మరా పిల్లల్ని, అయన ఎలా పోషిస్తున్నాడు?  పైగా ఆయన

జీవనాధారం చాయ్ బండిమాత్రమే" అన్నాడు.
  "నోర్ముయ్యరా! ఆ తల్లి పిల్లలు నీలా తిని తిరుగుతున్నారా? రోజూ మల్లెపూలు దండలు అల్లి డబ్బు సంపాయిస్తున్నారు. తెలుసా?

"ఎత్తిపోడిచింది లక్ష్మిదేవమ్మ.
  "ఆ...  దండలు అల్లుకుని ఎంత సంపాయిస్తారు గనుక? ఒక్క కిలోకి మూడురూపాయలు. మహా అంటే రోజుకి ఆరుకిలోల పుప్వులు

కడతారు అంతేకదా"
 "కష్టపడి సంపాయించేది రెండు రూపాయలైన చాలు "      
 "అయితే కొన్నిరోజులు ఆగు! నేనూ రోజుకు యభైరుపాయలు సంపాయింస్తాను"
 "నా కొడుకు యోగ్యుడైతే నాకు అంతకన్నా సంతోషమా? " అంటూ విసురుతున్న తల్లిచేయి పట్టుకుని ఆపి, ఆమెకు మరింతచేరువగా జరిగి

కూర్చుని, "ఒకమాట, నువ్వేమీ అనవుకదా? " లోలోపల భయపడ్తూనే అన్నాడు.
 "ఏం  మాట? "కొడుకువైపు సూటిగా చూసింది.
 "మొన్నరాత్రి సాయిబు ఇంటికి కారులో ఒక  పెద్దమనిషిలాంటి వ్యక్తి వచ్చాడే ఆయన నిజంగా పెద్దమనిషి కాదు. అరబ్బుషేకు. వాడికి

సాయిబు తన పెద్దకుతుర్ని మూడు లక్షల రూపాయలకు అమ్మినేస్తున్నడంట, పాపం" గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు భావానీశంకర్.
 "హా!  నీకు ఎవరు చెప్పార్రా  ఈ విషయం? "గుండెల పై చేయి వేసుకుంటూ కళ్ళింత చేసింది లక్ష్మిదేవమ్మ.
 "ఎలాగో తెల్సిందిలే కానీ, ఎట్లాగయినా చేసి ఆ పిల్లను మనం రక్షిద్దాం" అని ఆశగా తల్లివైపు చూశాడు భావానీశంకర్.
 "మనకెందుకొచ్చిన గొడవరా? నోర్ముసుకో" గదమాయించింది లక్ష్మిదేవమ్మ.
 "మానవత్వం  లేకుండా అలా మాట్లాడ్తావేం? "
 "ఇది వూరుకాదు, హైద్రాబాద్ ఊర్లలో అయితే హిందూ ముస్లింలు స్నేహంగామెలుడుతారు ఇక్కడ అట్లాకాదు గదా! తెలిసింది కూడా వాళ్ళతో

కల్పించుకుంటానంటావేం వూర్లల్లోనే కాదు, ఇక్కడ కూడా చాలా మంది హిందూముస్లింలు స్నేహితులుగా మెలుగుతున్నారుగా"
 "కావొచ్చు కానీ  ఆ సాయిబు ఎలాంటి వాడో నీకుతెలీదా? మూత్రం పోసేటప్పుడు ఇటుకముక్క పట్టుకోవడమేకాదు, హిందువులతో

మాట్లాడేటప్పుడు కూడా ఇటుకముక్క పట్టుకొని దోషం లేదనుకుంటాడు. అలాంటి వాడితో కల్పించుకుంటే ఇంకేమైనా ఉందా? లేనిపోని

మాటలు చెప్పి హిందూముస్లింలకి గొడవలు పెడ్తాడు. అప్పుడు నగరం రక్తంతో తాడిసిపోతుంది"
 "నిజమే! కానీ  ఆ పిల్లలు చాలామంచి వాళ్ళు. వాళ్ళకి అలాంటి తేడాలులేవు. మంచితనమే  మతం అనుకుంటారు... "
"ఆ  సాయిబు వాళ్ళతో మాట్లాడ్డానికి వాళ్ళ మతస్థులే భయపడ్తారు. మరి, ఆ పిల్లలు మంచివాళ్ళని నీకెలా తెలుసు? "
 "ఎలా అంటే... తెల్సింది అంతే"
 "గొప్పనిజం తెల్సుకున్నావు గానీ, నోర్మూసుకుని ఇంట్లో పడివుండు" అని చెప్పి, తిరగాలి విసురుకుంటూ "దమ్మిడి సంపాదనలేదు గానీ,

దానధర్మలకి తానే మహారాజు అన్నాడంట... వెనకటికి ఎవడో" తనలోతనే గొణుక్కుంది లక్ష్మిదేవమ్మ.
 "ప్చ్! నేను వాళ్ళకి ఏదో ధర్మం చేస్తానని అనడంలేదు" తల్లి గొణుగుడు విని అన్నాడు భావానీశంకర్.
 "సర్లేగానీ, ముందు సాలీడుగూళ్ళు దులిపి నడుం నొప్పుల్నుండి నన్ను కాపాడు" అంది లక్ష్మిదేవమ్మ.
 "నువ్వు ఒప్పుకుని వుంటే నీ అనుమతితో గౌసియాను తీసుకుని వెళ్ళిపోయేవాణ్ణి. ఇందువల్ల మీరు బాధపదకపోయేవాళ్ళు. మిమ్మల్ని

బాధపెట్టి వెళ్ళాలంటేనేమో నా మనసు ఒప్పుకోవడంలేదు ఇప్పుడేం చేయాలి? " తల్లినే చూస్తూ మనసులో అనుకుని,
 "అమ్మా! పిలిచాడు భవానీశంకర్ .
 "ఏంట్రా? ఇంతకీ ఈరోజు నన్ను పని చేసుకోనిస్తావా? చేసుకోనివ్వవా? విసుగ్గా తిరగలి విసరడం ఆపిందమె.
 "నాకు ఆ అమ్మాయి చూస్తుంటే ఏడుపొస్తోంది. అందుకే ఆ అమ్మాయిని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. నాకు ఓ నలుగు వందలు ఇవ్వు"

కూర్చునే తలవంచుకుని భయంతో తడబడుతూ అడిగాడు.
 లక్ష్మిదేవమ్మ కొడుకువైపు ఓ ముడుక్షణలు నివ్వెరపోయిం చూసింది.ఆ తర్వాత కొడుకు చెంపపై బలంగా కొట్టింది.
 ఆ దెబ్బకి అతడు అల్లంతదూరం తుళ్ళిపడ్డాడు.
 "నీ బతుకు నువ్వే బతకలేవు. పైగా వాళ్ళను ఉద్ధరిస్తానంటావా? ఇంకొక్కసారివాళ్ళ గురించిన మాట నీ నోటినుండి వచ్చిందా ఇక నీకు ఈ

ఇంట్లో అన్నంమెతుకులు వుండవు. పస్తులుండి చావాలి. వెధవ సన్యాసి" కోపంగా అంది లక్స్మిదేవమ్మ.
 భవానీశంకర్ కిమ్మనలేదు. తల్లివైపు రోషంగా చూస్తూ, లేచి బయటికి వెళ్ళి ఎప్పట్లా అరుగుమీద కూర్చుని గౌసియా కోసం చూడసాగాడు.
  అప్పుడు సమయం సాయంకాలం ఆరు గంటలు కావస్తోంది. ఆ సమయంలో బతులకోసం బయటికి వస్తుంది గౌసియ. అందుకే ఇంట్లో తల్లి

తనమీద ఇంకా గోనుగుతూనే వున్నా పట్టించుకోకుండా, ఆమె ఎప్పుడెప్పుడు బయటికివస్తుందా అని ఆత్రంగా ఎదురుచూడసాగాడు

భావానీశంకర్.
  కాసేపటికి మేతకోసంబయటికి వెళ్ళిన బాతులు బకబక అరుస్తూ తమ ఇంటిముందుకువచ్చాయి. వాటి రాకకోసమే తను ఇంతసేపు

ఇదురుచుస్తున్నట్లుగా ఆ వెంటనే ఇంట్లోంచి వెలుపలికి వచ్చింది గౌసియ.
 రాగానే అలవాటుగా భావానీశంకర్ కోసం చూసింది. అతడు కూడా ఆమెనే చూస్తూన్నాడు. ఇరువురి చూపులు పలకరించుకున్నాయి.

పైకిమాత్రం పరిచయంలేని వాళ్ళలా కన్పిస్తున్నారు.
 "బ్బ ... బ్బ ...బ్బ ... " బాతుల్ని ఇంటిముందు కట్టిన ఒక చిన్న గుడులోకి తోలుతోంది గౌసియా.
  ఆమెనే చూస్తూ తల్లికొట్టిన దెబ్బను గురించి పూర్తిగా మర్చిపోయాడు భావానీశంకర్.
 "ఏంట్రా...  ఎవ్వరితోనైన దెబ్బలాడావా? చెంప కందిపోయి  వుంది" అంటున్న తండ్రి మాటలకు ఇహలోకంలోకి వచ్చాడు భావానీశంకర్.
 తండ్రి గోపాలయ్య అప్పుడే వచ్చినట్టున్నాడు.  ఇంకా  సైకిల్  కూడా  దిగకుండానే  కొడుకుని  గాభరాగా చూస్తున్నాడు.  
 "నేను దెబ్బలాడలేదు" పౌరుషంగా అన్నాడు భావానీశంకర్.
"వాడి నిర్వాకం గురించి నేను చెప్తాను గానీ, మీరు ఇంట్లోకిరండి" ఆ వెంటనే ఇంట్లోంచి లక్ష్మిదేవమ్మ గొంతు వినడింది.
 "ఏం చేశావురా? "అంటూనే సైకిల్ దిగి, ఒకపక్కగా ఆపి ఇంట్లోకి నడిచాడు గోపాలయ్య
 భావానీశంకర్ అక్కడే కూర్చుండిపోయాడు. అప్పటికి గౌసియ లోపటికి వెళ్ళి పోయింది. ఆమె చిన్నచేల్లెళ్ళు ఇద్దరు మాత్రం ఇంటిముందుకి

వచ్చి తువ్వళ్ళని చీరలుగా కట్టుకుని టిచర్లగా ఆటాడుకుంటున్నారు.
  ఆ ఇంటికి రెండిళ్ళ అవతలవున్న మరో పెంకుటింట్లోంచి తబలా వాయిస్తు ఖవాళి పాడుతున్న గొంతులు స్పష్టంగా వినబడుతున్నాయి అది

కూడా ముస్లింల ఇల్లే. వాళ్ళ అబ్బాయికి ఇంకో వారంరోజుల్లో పెళ్లి. ఆ సంతోషాన్ని ఆరోజునుండే అనుభవిస్తూన్నారు వాళ్ళు ఆ ఇంటితర్వత

అన్నీ హిందువుల ఇళ్ళు వున్నాయి.
 ఆ ప్రాంతం మొత్తానికి సుమారుగా పది వరకు ముస్లిం కుటుంబాలు వున్నాయి. అది పూర్తిగా దిగువస్థాయి ప్రాతం.అంతా పల్లెటూరి

వాతావరణం గోచరిస్తుంది. అయినప్పటికీ అక్కడ హిందూ, ముస్లిం తేడాలు వున్నాయి.
 మొదట్లో హిందూముస్లింలు చాలా స్తబ్దతగా కలిసిమెలిసి వుండేవారు అక్కడ. ఎక్కడ మతసంబంధ గొడవలు జరిగినప్పటికీ ఆ ప్రాంతములో

మాత్రం శాంతిభద్రతలకి భంగం కలగకపోయేది. అయితే రామ జన్మభుమి గొడవలు లేవనెత్తారు. అది మొదలు ఆ  ప్రాంతంలో హిందూముస్లింల

మధ్య స్నేహభావం చెడిపోయింది.
 "శంకర్... " ఇంట్లోంచి తండ్రి పిలుపు.
 "మళ్ళి చివాట్లు తప్పవు" అనుకుంటూలేచి లోపలికి నడిచాడు భావానీశంకర్.
 "నువ్వు గొప్ప సంఘసంస్కర్తగా మారాలనుకుంటున్నావా? "వెళ్ళగానే అడిగాడు తండ్రి గోపాలయ్య.
 సమాధానం చెప్పలేదు భావానీశంకర్. తల వంచుకుని నిలబడిపోయాడు.
 "అసలే ఇక్కడ పరిస్థితి బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రాజారామ్మోహనరాయ్ వో, కందుకూరి వీరేశలింగానివో కానవసరంలేదు.

నాకొడుకు భావానీశంకర్ గా బతుకుచాలు" అన్నాడు గోపాలయ్య అప్పటికీ పెదవి విప్పలేదు భావానీశంకర్.
 "సాయిబు ఎంత దుర్మార్గుడో, మన పక్కింటి బాలస్వామి అంతకన్నా పదిరెట్లు దుర్మార్గుడు. వాడికి ముస్లిం పిచ్చి వీడికి హిందూ పిచ్చి

ఇలాంటి మనుషులమధ్య నువ్వు ఆ పిల్లను రక్షించాలని వెళ్తే తలలు తెగడం ఖాయం అయినా కాపాడుతానని నీవు అడుగు ముందుకు

వేసినంత మాత్రాన ఆ పిల్ల నీ వెంట వస్తుందనుకుంటుంన్నావా?  పిచ్చివాడా? వాళ్ళ పిల్లలు ప్రాణంపోతున్నా సరే గోష దాటి బయటికి రాలేదు.

అయినా ఆ పిల్లను కాపాడ్డానికి  నీకేం హక్కుగానీ, సంబంధంగానీ వుందిరా? "కచ్చితంగా అడిగాడు గోపాలయ్య.
 "ఎదుటివాళ్ళని కాపాడ్డానికి హక్కులతో సంబధాలతో పనిలేదు పప్పా" మనసులోనే అనుకున్నాడు భావానీశంకర్.
 "ఇంక వెళ్ళరా. నాముందు నిల్చోవద్దు" అన్నాడు గోపాలయ్య.
 వెనుతిరిగి మోనంగా బయటికి నడిచాడు
భవానిశంకర్.

 

....... వచ్చే బుధవారం పార్ట్ 3......