నిదురబోడూ కృష్ణుడూ
నిదురబోడూ కృష్ణుడూ
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా... జో అత్యుతానంద జోజో ముకుందా, రామ లాలీ మేఘశ్యామ లాలీ లాంటి పాటలు ఇంటింటా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పాటల కోవలో ఓ అరుదైన జానపదం ఇది. ఎంత నిద్రపుచ్చుతున్నా కూడా నిద్రపోకుండా మారం చేస్తున్న బిడ్డను చూసి తల్లి పాడే ఈ పాటని వినితీరాల్సిందే! విన్నాక తనివితీరా పాడుకోవాల్సిందే!
నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు
అయ్యో వీడు నేడు
కుదురుగా ముజ్జగములు జో
కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥
గట్టిగా విభూతి నుదుట
పెట్టి చూచి సంధ్యవేళ
చుట్టుగాను గొప్ప దిష్టి
దీసివేసి తేనుగాని ॥నిదురబోడూ॥
తంత్రమున నేను మహి
మంత్రవాదుల బిలిపించి
మంత్రింపించి మొలకొక్క
యంత్రము గట్టినగాని
నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు
అయ్యో వీడు నేడు
కుదురుగా ముజ్జగములు జో
కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥
