Facebook Twitter
నృత్యం

నృత్యం
 

మన భారతదేశంలో  శాస్త్రీయ నృత్యాలు... ఎనిమిది రకాలు... అవేమిటంటే.....

ఆంధ్రప్రదేశ్ లోని ..... కూచిపూడి

తమిళనాడులోని..... భరతనాట్యం

ఉత్తర భారతదేశంలోని... కధక్

కేరళ లోని ......... కధాకళి

ఒరిస్సాలోని ....... ఒడిస్సీ

మణిపూర్.అస్సాం, బెంగాల్ లోని... మణిపురి

కేరళలోని............. మోహిని అట్టం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని....పేరిణి న్రుత్యం.... తెలుసుకుందాంమా వీటి వివరాలు....

 

1. కూచిపూటి నృత్యం:  

తెలుగు వారి అతి ప్రాచీన సాంప్రదాయ న్రుత్య రూపం కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి భాగవత కళాకారులచే ప్రసిద్ధి పొందినది కనక దీనికి కూచిపూడి నాట్యం అని పేరు వచ్చింది. ఈ నాట్యానికి సిద్దేంద్రయోగి పితామహులు. వీరు రచించి రూపొందించిన భామాకలాపం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది సంగీత పరమైన నాటక కళ. దీనిలో అభినయం, భావప్రకటనకు ప్రాధాన్యం ఉంటుంది. గొల్లకలాపం, యక్షగాన న్రుత్యనాటికలు, జయదేవుని గీతాలు క్షేత్రయ్య పదాలు, ఉషాపరిణయం, వంటివి కూచిపూడికి చెందిన ప్రసిద్ధ నాట్య విశేషాలు. ఈనాట్యంలో ప్రసిద్ధి చెందిన వారెందరో ఉన్నారు. వేదాంతం సత్యనారాయణ, లక్ష్మీనారాయణ శాస్త్రి వెంపటి చినసత్యం, రాధారాజారెడ్డి, శోభానాయుడు, యామినీ క్రిష్ణమూర్తి మొదలైన వారెందరో ఉన్నారు....

 

2. భరతనాట్యం :

భరతనాట్యం అనేది తమిళనాడులో బహుళ ప్రాచుర్యం పొందిన నృత్యం. భరతముని రచించిన నాట్యశాస్త్రం కనక దీనిని భరతనాట్యం.  భ... అంటే భావం... ర.... అంటే....రాగం... త.... అంటే... తాళం... ఈ మూడింటి సమన్వయమే భరతనాట్యం. దీనిని అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలతో దేవాలయంలో ఎక్కువగా ప్రదర్శించేవారు. జయదేవుని అష్టపదులు, క్షేత్రయ్య పదాలు, క్రుతులు కీర్తనలు జావళీలు, తిల్లానాలు భరతనాట్య అభినయంలో తలమానికములు. భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు రుక్మిణీ అరందేల్, బాలసరస్వతి, వైజయంతీమాల. యామినీ క్రిష్ణమూర్తి మ్రుణాళినీ సారాబయి, పద్మా సుబ్రహ్మణ్యం, కమలా లక్ష్మణ్ మొదలైన వారందరూ భరతనాట్యంతో అందరినీ అలరించారు.

 

3. కధక్ :

కధక్ న్రుత్యం అనేది... ప్రసిద్ధి గాంచిన శాస్త్రీయ నృత్యరూపం. కధ చెప్పేవారిని కధక్ అని అంటారు. ఈ పదం నుంచే కధక్ అనే పేరుతో ఈ నాట్యం ప్రసిద్ధి చెందింది అంటారు. రాధాక్రిష్ణుల గాధలను ప్రధర్శించడం ద్వారా శ్రుంగార రసాన్ని అందిస్తుంది. మీరా భజనలు, టుమ్రీలు, గజల్స్ వంటి సాహిత్య ప్రక్రియలకు ఈ నాట్యాభినయం చేస్తారు.  కధక్ నాట్యంలో రెండు రీతులు, ఒకటి లక్నో ఘరాన, రెండవది జైపూర్ ఘరాన ఉంటాయి. లక్నో ఘరానలో మొగల్ సాంప్రదాయపు జైపూర్ ఘరానాలో వైష్ణవ సాంప్రదాయపు ప్రభావం ఉంటుంది. ఇలాకధక్ నాట్యకళారంగంలో ప్రసిద్ధిచెందిన కళాకారులు.. బ్రిజ్ మహరాజ్, సుందర్ ప్రసాద్, కల్కదీన్ మహారాజ్, మధుమతి, కుముదిని, గోపీక్రిష్ణ, సితారాదేవి, దమయంతోదోషి గారి లాంటి వారందరూ ఎంతగానో అలరించారు.

 

4. కధాకళి :

కధాకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందిన నృత్యం. కథ అంటే కధ, కళి అంటే ఆట.... అంటే ఒక కధను గానం చేస్తూ నృత్యం తో అభినయించటాన్ని కధాకళి అంటారు. వీరి ఆహార్యం, వస్త్రాలంకరణ, నేత్ర చలనాలు చక్కగా ఉంటాయి. రౌద్ర, వీర.భయానక భీభత్స రసాభినయంలో వీరు కడు సమర్ధులు.  ఇలా కధాకళి నాట్యరంగంలో ప్రసిద్ధులు...గురుగోపీచంద్, చంపకులం పరమపిళ్ళై, వల్లతోల్ నారాయణన్ మీనన్, ఉదయశంకర్,  నంబూద్రి గోపీనాధ్ మొదలైన వారు ఎంతగానో అలరించేవారు.

 

5. ఒడిస్సీ :

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రాచీన నృత్య రూపం.. ఒడిస్సీ. ఓడ్ర శబ్దమునకు ఒరిస్సా శబ్దమునకు మధ్య సమన్వయ సరళ శబ్దరూపమే ఒడిస్సీ. కూచిపూడి, భరతనాట్య పోలికలతో ఉండి హావ, భావ, లయ సమన్వయంతో  ఒడిస్సీ నాట్యం ప్రదర్శింపబడుతుంది. జదయదేవుని గీతగోవిందం, అష్టపదులు ఈ నాట్యరీతిలో ప్రదర్శింపబడుతాయి. ఇలా ఒడిస్సీ నాట్యరంగంలో ప్రసిద్దులు గురుశ్రీ రవిచంద్ర కాళీచరణ్ పట్నాయక్, దేవేంద్రశతపతి, సంయుక్తా పాణిగ్రాహి,యామినీ క్రిష్ణమూర్తి, గురు పంకజ్  చరణ్ దాస్ లాంటి వారు ఎంతగానో అలరిస్తారు. 

 

6. మణిపురి :

15 వ శతాబ్ది నుండి మణిపూర్ లో ప్రదర్శింపబడుతూ ఈశాన్య భారతదేశంలోని  అస్సాం బెంగాల్ రాష్ట్రాలలో కూడా ప్రాచుర్యం పొందిన నాట్యరూపం మణిపురి. ఇందులో ముఖ్యంగా రాధాక్రిష్ణులు గోపికల కధాంశాలు ఇతివ్రుత్తంగా తన్మయత్వంతో న్రుత్యం చేస్తారు.రకరకాల రంగుల అద్దాలతో కుట్టిన లంగాలు ధరించి శిరోజాలు శివుని జటాజూటములు లాగ దువ్వి నెత్తిపై గోపురాకారాలుగా అలంకరించుకుంటారు.  పంజ్ అనే డ్రమ్ములు మోస్తూ ప్రధర్శిస్తారు. విశ్వకవి రవీంద్రనాధుని శాంతినికేతన్ లో నాట్యానికి మెరుగులు దిద్ది కొత్త ఊపిరిపోశారు. ఈ నాట్యకళలో ప్రసిద్ధులు. ఝవేరి సోదరీమణులు, నవినా మెహతా, నిర్మలామెహతా, గురుబిను సిన్హా కళావతీదేవి, సూర్యముఖి చారుసిజ, సంఘజిత్ సింగ్, లాంటి వారు ఎంతగానో అలరిస్తారు.

 

7.మోహినీ అట్టం :

కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన న్రుత్యం మోహినీ అట్టం. ఇదీ భరతనాట్యం కూచిపూడి లాగే దేవదాసి సంప్రదాయం ద్వారా ప్రసిద్ధి గాంచింది. నేత్రముల చలనములతో కనుబొమ్మలు, కనురెప్పలు, ముక్కుపుటలతో వీరు అద్భుతమైన భావ ప్రకటన చేస్తూ నాట్యం చేస్తారు. వీరి ఆహార్యం,అభినయం అతిమనోహరంగా నేత్రపర్వంగా ఉంటాయి. ఈ నాట్యకళలో ప్రసిద్ధులైన వారెందరో... ఉన్నారు.. వారిలో వల్లోత్తల్ కవి, కల్యాణి అమ్మ, వైజయంతిమాల, హేమమాలిని రీటా దేవి గారు లాంటి వారు ప్రముఖులు.

 

8. పేరిణి నృత్యం:

కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలో ఉండి తరువాత మరుగున పడినది పేరిణి న్రుత్యం. దీనిని డా.నటరాజ రామక్రిష్ణ తిరిగి జీవం పోసి  ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన అనేక సార్లు రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడి శిల్పాలలోని న్రుత్య భంగిమలను పరిశీలించి తన శిష్య బ్రుందముతో పేరిణీ శివతాండవ నృత్యన్ని రూపకల్పన చేశారు.  ఇలా మన భారతదేశంలో  పలుచోట్ల సంప్రదాయ న్రుత్యాలతో కళాకారులందరినీ అలరిస్తున్నారు.