కవంటే...

  కవంటే...       వాడంతే ప్రతి దాన్ని భూతద్దంలోనూ ప్రతి భావాన్ని ఒకద్దంలోనూ మరిన్నిటిని సరికొత్త అర్ధాలలోను వెతుకుతాడు తన్మయత్వాన్ని నువ్వు చదివే కళ్లలో వెతుకుతుంటాడు అన్యాయాన్ని ఎదురిస్తాడు అందాన్ని ఆరాధిస్తాడు ఆక్రందనకు మరిన్ని గళాల్నిస్తాడు ఆవేదనను ఖడ్గాలుగా మార్చేస్తాడు వాడితో వాడు వాదించుకుంటాడు చర్చిస్తాడు విమర్శించుకుంటాడు ఓటమో , గెలుపో తెలియక తన వేలి తలతో గీసుకున్న కొన్ని రాతలను మీ ముందుంచుతాడు వాడికీ ఉంటాయ్ సంతోషాలు ఇష్టాలు,కష్టాలు నష్టాలు,అరిష్టాలు లెక్కేముంది వాడికి సంతోషంలో కూడా బాధను బాధలోనూ సంతోషాన్ని నిజంలోని అబద్దాన్ని అబద్దమనిపించే నిజాల్ని ఏరతాడు! చిన్న పిల్లాడు తీరంలో వెతికే గవ్వల్లా తొలిపొద్దు కూసే గువ్వలా..! వాడికీ ఏడుపొస్తది కాకపోతే కన్నీటిని అక్షరాలుగా రాలుస్తాడు కాగితపు చెంపలపై! నవ్వుతాడు మీరు చదివినప్పుడు మీ పెదాలపై భావుకతలా! వాడే కవి.....!!! నిశ్శబ్దపు సడులను వినే చెవి రాత్రి కూడా మేల్కొనే రవి!!!! నీ వాడే కవి!! వాడు మాత్రమే "కవి"..!!!!! - Raghu Alla  

కవంటే ?

కవంటే ?    వాడంతే ప్రతి దాన్ని భూతద్దంలోనూ ప్రతి భావాన్ని ఒకద్దంలోనూ మరిన్నిటిని సరికొత్త అర్ధాలలోను వెతుకుతాడు తన్మయత్వాన్ని  నువ్వు చదివే కళ్లలో వెతుకుతుంటాడు అన్యాయాన్ని ఎదురిస్తాడు అందాన్ని ఆరాధిస్తాడు ఆక్రందనకు మరిన్ని గళాల్నిస్తాడు ఆవేదనను ఖడ్గాలుగా మార్చేస్తాడు వాడితో వాడు వాదించుకుంటాడు చర్చిస్తాడు విమర్శించుకుంటాడు ఓటమో , గెలుపో తెలియక తన వేలి తలతో గీసుకున్న కొన్ని రాతలను మీ ముందుంచుతాడు వాడికీ ఉంటాయ్ సంతోషాలు ఇష్టాలు,కష్టాలు నష్టాలు,అరిష్టాలు లెక్కేముంది వాడికి సంతోషంలో కూడా బాధను బాధలోనూ సంతోషాన్ని నిజంలోని అబద్దాన్ని అబద్దమనిపించే నిజాల్ని ఏరతాడు! చిన్న పిల్లాడు తీరంలో వెతికే గవ్వల్లా తొలిపొద్దు కూసే గువ్వలా..! వాడికీ ఏడుపొస్తది కాకపోతే కన్నీటిని అక్షరాలుగా రాలుస్తాడు కాగితపు చెంపలపై! నవ్వుతాడు మీరు చదివినప్పుడు మీ పెదాలపై భావుకతలా! వాడే కవి.....!!! నిశ్శబ్దపు సడులను వినే చెవి రాత్రి కూడా మేల్కొనే రవి!!!! నీ వాడే కవి!! వాడు మాత్రమే "కవి"..!!!!!   -రఘు ఆళ్ల

సిండ్రెల్లా

ఏ దేవతిచ్చిందో కలల రెక్కలున్న కావ్యపు కుంచెనూ, దోసెడు రంగుల్నీ దోచేసే నీ నవ్వుల రకాలుగా దొరికిందో తెల్లటి కాగిత'మది' గీద్దామని ఒక చిత్రాన్ని పాదాల అంచు నుంచి మొదలెట్టా గాజు చెప్పులు తెల్లటి గౌనూ,నల్లటి కురులు రధమెక్కి ప్రయాణిస్తున్నట్లు కుంచె గీస్తుందిప్పుడు అనుభూతుల అశ్వవేగంతో రధపు అశ్వాలను వేగపు శ్వాసలిడుతూ ఓయ్ సిండ్రెల్లా అది నువ్వే అది నీ నవ్వే చూసుకో ఓ సారి కనులు మూసి నే వేసిన నీ చిత్తరువు అశ్వాల గిట్టల చప్పుడుతో కలిసి వినవస్తున్న నా గుండె సవ్వడి నీకిప్పుడు వినిపిస్తుంది చిన్నప్పుడు చదివిన కధలో నీవేగా నా సిండ్రెల్లా.. నే గీ(రా)సిన అద్భుతంలో నీవేగా నిలువెల్లా.. నువ్వేనా నా హరివిల్లా...!!!   - రఘు ఆళ్ల

నాక్కావాలిప్పుడు

నాక్కావాలిప్పుడు     కనురెప్పలు పడే శబ్దం నుంచి మది ఎదురీతల సందడి నుంచి చీకటి అంతమయ్యే చిక్కదనం నుంచి ఒకటి కావాలి నాకిప్పుడు రాలే శిశిరాల శిఖలు వాలే హేమంతపు జల్లులు గుచ్చి గుచ్చే గ్రీష్మపు తాపాల నుంచి ఒకటి కావాలి నాకిప్పుడు నాకు నేను గా, గావు కేక పెట్టినా చావు పుట్టుకలు లేని రాత కోతలుండని రేయి పగలెరుగని నిశ్శబ్దమొకటి కావాలిప్పుడు నాకు నువ్వు వెతకలేని నేను సైతం బయట పడలేని లేదని నన్ను భ్రమింపచేసి అశాశ్వత భ్రమల్లో నుంచి నన్ను  శాశ్వత రాగాన్ని వినిపించే నిశ్శబ్దమొకటి నాక్కావలిప్పుడు నాక్కావాలి నాకే కావాలి నాకై వాలాలి హక్కై కురవాలి ఆ నిశ్శబ్దమిప్పుడు నా నిశ్శబ్దమెప్పుడూ   -రఘు ఆళ్ల

క్షణ క్షణం నీతో నేను

క్షణ క్షణం నీతో నేను     ఆ రోజు చూశా ఇరవై యేళ్ళు పెంచిన అమ్మ నాన్న దూరం అవుతుంటే నీ కళ్ళల్లో వచ్చిన స్వచ్ఛమైన కన్నీళ్ళని... అప్పుడే తెలిసొచ్చింది బంధం అంటే ఇదేనని.... ఆ ఒక్క క్షణం నువ్వు నాకు దగ్గరవ్వబోతున్నావన్న సంతోషం కన్నా నీ వాళ్ళని దూరం చేస్తున్నానన్న బాధే ఎక్కువనిపించింది.... అప్పుడే తెలిసొచ్చింది బాధ్యత పెరిగిందని.... మీ ఇంటి నుండి మా ఇంటికున్న రెండుగంటల ప్రయాణంలో దారంత నా చేయి గట్టిగా పట్టుకునే ఉన్నావ్. ఆ స్పర్శలో సున్నితత్వం కన్నా నీ మనసు సంధిస్తున్న ప్రశ్నలే తాకాయి నన్ను... అప్పుడే తెలిసొచ్చింది ప్రతి నిమిషం నీ తోడుండాలని.... వచ్చేశావు కొత్త హద్దులున్న బంధులోకం లోకి పరిచయమే లేని కొత్తలోకం లోకి మీ లోకం నుండి మన లోకం లోకి... ఎన్ని మార్పులొచ్చినా.... తెచ్చినా... నీ నవ్వుతో నెట్టుకొచ్చేస్తావ్ అనుకున్న నా నమ్మకాన్ని గెలిచేశావు గడుస్తున్నాయి పన్నెండేళ్ళుగా రాత్రింబవళ్లు... ఎన్నోసార్లు మనం దాచేస్తున్నా ఇబ్బందిలా రాకుండా ఆపుతున్న కన్నీళ్ళలా కలిసే గడపాలనుకున్న క్షణాల్లా మనాశలను కలిపి కడుతున్న ఊహల్లా... కొన్ని రోజులు ఇంకొన్ని రోజులు... ఇలాగే గడిచిపోని... ఓపికనే ముసుగులో భవిష్యత్తనే మాయలో పరిగెడుతున్న మన విలువైన కాలాన్ని పోరాడి మరీ ఏదో ఒక రోజు శాశిద్దాం వినకుంటే మన శ్వాసలనే ఆపేద్దాం ఇది క్షణికావేశపు నిర్ణయం కాదని నిరూపిద్దాం....   -సయ్యద్ తాజుద్దీన్

విహారిస్తావ్

  విహారిస్తావ్     ఒకసారలా విహారానికెళ్లోద్దాం...రా..! ఆ తావుల్లో ఎదురేగేది ఆ కోనల్లో ఎగిరేది చూస్తుండు నాతో చెమటలారిన బీడు దేహాలు చిగురొచ్చి రాలిన కాసిన్ని ఆకులు దేనికి పుష్పించాయో తెలియని తెల్ల మొహాలేసిన నలిగిన నల్లటి పువ్వులు కొన్ని చరిత్రలో బద్దలైన రాళ్లు మరిన్ని చెంపలూడిన చెదబెరళ్లు ఇంకొన్ని వాటి గమనాన్ని వాటినెతుక్కుంటున్న చలి చీమలు కలి పాములు సాయానికి సోలిన చేతులు గాయానికి లేచిన రాతలు పగటినే చూడని రాత్రులు . . . విహారంలో అగుపిస్తాయక్కడ సమాహారమైనట్లు సమావేశమైనట్లు నీ కోసమే ఉన్నట్లుంటాయ్! నా చేతిని పట్టుకున్న గడియారపు బాటలో...! ఇప్పుడు చూడు నీకు నువ్వుగానే నీ నవ్వులో విహరిస్తుంటావ్... నీ గడియారాపు ముళ్ల మధ్య, వెనక్కి తిరుగుతూ.. ముందుకు సాగుతూ... విహరిస్తున్నావ్ చూడిప్పుడు!!!!  - రఘు ఆళ్ల  

ప్రేమే

ప్రేమే     అవునుగా మరి కనురెప్పల వెనుక ప్రతిష్టించి కలల అభిషేకాలతో నన్ను ముంచెత్తావని.. తియ్యటి మనసుని ప్రసాదమిచ్చి వేవేల క్షణాల హారతిలో ఆర్తిగా నువ్వు కరిగావని నాకెలా తెలుస్తుంది మరింతగా మరీ ఇంతగా మరెంతగా నన్నిలా నన్నే ఇలా నావనేలా నీవిలా మారి నీలోని నాకు నాకైన నీకు ఇవ్వగలిగింది నువ్వలిగింది నవ్వు 'అలిగింది' దీనికేగా! ప్రేమనే ప్రేమైన ప్రేమించిన పేరు పేరు 'ప్రేమ' అని ప్రేమించడానికి నాకు దొరికిన ఒకే ఒక కారణం నన్ను ప్రేమించడం! ఇంతకంటే చెప్పడానికి మాటల్లేవ్ దేనికంటే మాటల్లోని మౌనం మౌనం లోని మాటల మధ్య ఘర్షణేపాటిదో రుచి చూసిన నీకు తెలుసని ఈ మాట! {మాటల్లేవని చెప్పక ఒక మాట చెప్పు మౌనానికీ ఒక మాటిచ్చేలా!!} - రఘు ఆళ్ల  

పిచ్చుక జ్ఞాపకం

పిచ్చుక జ్ఞాపకం     బాగా గుర్తు, బాగా చిన్నపుడు ఇంట్లోనే కాపురముండే పిచ్చుక జంటలు చెడుగాలి పోయేందుకు పెట్టుకున్న కన్నాల వెంటిలేటర్లలో గూళ్ళు కట్టుకునేవి మాకింకా తెల్లవారకుండానే కిచకిచమనేవి రోజంతా ఏ తెరిచి ఉన్న కిటికీ లోంచో తలుపులోంచో వాళ్ళింట్లోకీ బయటకీ యధేఛ్చగా ఎగిరేవి చలికాలమైనా సరే ఓకిటికీ వాటికోసం తెరిచి ఉండేది, తెరచి ఉంచిన మనసుల్లా. ఒకటా రెండా, మూడో నాలుగో జంటలు. బియ్యంలో బెడ్డలు ఏరుతూ అమ్మ వేసే వడ్ల గింజలు చక చకా తింటూ నిముషాల్లో చుట్టూ మూగి టకటకా బుజ్జి బుజ్జి అడుగుల్తో సంతోషానికి చిహ్నంలా ఉండేవి. ఎంత ఆనందంగా ఉండేదో ఇసుకలో అవిచేసే పొడి స్నానాలు ఏ స్వఛ్చమైన చెరువులోనో అల్లరిగా ఈత కొడుతూ చేసే సాయంకాలపు తడి స్నేహాల స్నానాలను తలపిస్తూ. నూనెలో వేగుతున్న జంతికల కోసం పళ్ళేలు పట్టుకుని లొట్టలు వేస్తూ నాకు ఫస్టంటే నాకు ఫస్టంటూ అమ్మని తొందర పెట్టే మా అల్లరిలా విచ్చుకున్న త్రిభుజాల్లా తెరుచుకున్న నోళ్ళతో తల్లి పిచ్చుక మీదకెగిరే కూనలెంత ముద్దొచ్చేవని. చందమామ కధల్లోని భేతాళుడి ప్రశ్నకి ఎవరికి తోచిన జవాబు వాళ్ళు గందరగోళంగా చర్చిస్తుంటే వాటికేదో తెలిసినట్లు ఒకటే రొద పెట్టేవి. మాలో మేము గొడవపడి ఒకళ్ళనొకరు పిడిగుద్దులతో కుమ్ములాడుకుంటుంటే అవి మాత్రం వాటి ముక్కులతో సుతారంగా ఒకదాన్నొకటి ప్రేమగా ముద్దులు పెట్టుకుంటూ తప్పర్రా...! అలా కొట్టుకోకూడదంటూండేవి. కొత్తగా వచ్చిన రెక్కలతో ఆ పసిపిట్టలు ఎగిరే సాధన అంతా ఇంట్లో మా పర్యవేక్షణలోనే జరిగేది ఎగరటం వచ్చాకా ఇంక అంతే మరి కనిపించేవే కావు, యూ ఎస్ కెళ్ళిన పిల్లల్లా. ఏ రెండు పిచ్చుకలో మరి కొన్నాళ్ళు నిరాసక్తంగా, అయిష్టంగా ఎగిరేవి మళ్ళీ జోడు కట్టి కొత్త సంసారం మొదలెట్టేవరకూ. గూడు కోసం ఏరుకొచ్చే పుల్లా పుడకా పొరపాటున జారిపడి నీచు కంపుకొట్టే గుడ్లు మధ్యాహ్నం నిద్రపోనీకుండా అవి చేసే అల్లరి ఎందుకో మరి ఎప్పుడూ చికాకనిపించేలేదు. ఎంత మొద్దు నిద్దర పోయామో తెలియదు ఓరోజు మెలకువ వచ్చేసరికి ఓ బుల్లి పిచ్చుక ప్రేమగా నన్ను చుట్టుకోవాలనుకుందేమో మరి నేనటూ ఇటూ మత్తుగా దొర్లినపుడు నా శరీరం కింద నలిగి నిర్జీవంగా పడుంది.... అంతే అదే ఆఖరుసారి నే పిచ్చుకని చూడటం. ఆ పిచ్చుకకి పెట్టిన దినమట ఈరోజు పేపర్లో ఫొటోతో సహా చూస్తే గుర్తొచ్చిన పిచ్చుక జ్ఞాపకాలు ..... ఎందుకు విచారం నేచూపిస్తానీ పిచ్చుకని అంటూ అరచేతిలో వాలింది ఓ బుల్లి అస్త్రం అదే పిచ్చుక మీద మనుష ప్రపంచం వేసిన బ్రహ్మాస్త్రం.   పిచ్చుక జ్ఞాపకం ..... వర్ధిల్లాలి.   - శారద శివపురపు

నీలి మేఘమా

నీలి మేఘమా   నీలి నీలి మేఘమా నిండైన నీటి మేఘమా ధరణిని కమ్మిన మేఘమా దయదల్చి నీ గర్భముండు నీటిని విడువుమా  ఉరుకులు పరుగులు తియ్యకు మేఘమా నిట్ట నిలువున నింగిన నిలిచి భువిపై నీటి పన్నీరు చిలుకరించవా   ఆ పన్నీటిలో పుడమి పులకరించెను కదా  అరుపుల మెరుపుల మేఘమా అలరించెను నీవు కట్టిన నీలి నీటి చీర మురిపించెను నీలో దాగి ఉన్న  వజ్ర కాంతుల ఇంద్రధనస్సు పుష్పించెను పుడమి తల్లి పంట బిడ్డలు  సూర్య చంద్ర నక్షత్రాలను సైతం దాగెను నీలోన.. పగటిని రేయి చేయగల శక్తి నీదు గలదు గదా ఓ కారు చీకట్ల కారు మబ్బు  పొగబడితే కరువును బహుకరిస్తావు ప్రేమిస్తే జీవాలకు ప్రాణాలు పోస్తావు నల్లని రూపు ఉన్ననూ తెల్లని మనస్సుతో ధరణిని కనికరిస్తావు  కడలి నుండి కడుపు నింపుకొని పుడమి పొట్ట నింపుతావు సూర్య నిప్పులను సైతం కారు మబ్బుల్లో చుట్టి పడేస్తావు  ఆకాశన నీలి పందిరివై ధరణీపై సలీల కల్లపి చల్లి వాగు, వంక, యేరు ,సెలయేరు కుంట ,సరస్సు, నది , అంబోనిధిని నింపుతావు..!! నీలి నింగికి శ్వేత వస్త్రం చుట్టినట్లు ఉంటావు కడలితో జతకట్టి నీలి గర్భం దాల్చి పండంటి నీటి రత్నాల బిందువులను పుడమికి పంచుతావు కదా ఓ నీలి నీటి మేఘమా !!!!   మీ భవదీయుడు జాని. తక్కెడశిల