వరము (కవిత)
posted on Feb 28, 2017
వరము
సీll సిగలోన చేమంతి l నగులోన పూబంతి
మోమున ముంగురుల్ l మోహ మీమె
పలుకలో చిలకమ్మ l వలపులో నెమలమ్మ
జతలోన రేయమ్మ l జాబి లీమె
నడకలో రాయంచ l నడుములో నెలవంక
పిఱుఁదులో కెరటమ్ము l పేర్మి నీమె
ఎదపైన మురిపాలు l గదిలోన సగపాలు
మదిలోన రసగంగ l మైక మీమె
ఆll కుందనములు పొదిగి l నందంబు గలిగున్న
భార్య గనక నైతె l బ్రతుకె వరము
నర్సపురని వాస l నటరాజ ఘనమోక్ష
విశ్వకర్మ రక్ష l వినుర దీక్ష.
పద్య రచన
రాజేందర్ గణపురం