posted on Apr 1, 2017
న్యాయమా
నీ చల్లని చూపుల ఒడిలో ప్రాణం పోసుకోవాలి అని
అనుక్షణం ఆరాటపడుతుంటే..!
నీ నయనాల స్పర్శ నన్ను దాటి వేరొక యదను
తాకుతుంటే ఆ గాయం నా గుండెను కోస్తుంది
నీ చిరునవ్వు మత్తులో నన్ను ముంచేస్తూనే నన్ను
ఒంటరి దాన్ని చేసి ఎడిపిస్తున్నావే ఇది నీకు
న్యాయమారా..?
-జ్యోతి