చెలి నీతోనే నా ప్రయాణం (వాలెంటైన్స్ డే స్పెషల్)
posted on Feb 13, 2017
చెలి నీతోనే నా ప్రయాణం
(వాలెంటైన్స్ డే స్పెషల్)
.
చెలి నీ మేనిని తాకిన గాలి సుగంధభరితమై నన్ను చేరేనే...
నీ తలపులు నా మదిలో పూల ఝల్లులు కురిపించెనే...
నీ వాలుచూపుల కిరణాలు నా యదలో జ్యోతులై వెలిగెనే..
నీ నవ్వుల కిలకిలలు నా చెవిలో జలపాతాల సవ్వళ్ళులా మ్రోగెనే...
జీవితం ఒక ప్రయాణం...
జీవనం ఒక ప్రమాణమని ఎవరో అన్నారు...
చెలి నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి...
చెలి నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి....
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు