నీ భరోసా
posted on May 11, 2017
నిజం రా..
నిజం రా..
ఒక్క క్షణం నీ సమక్షం ఎంత హాయినిస్తుందో తెలుసా..
పదే పదే కావాలనిపించేంత..
నీ అభిమానం ఎంత ఆనందాన్నిస్తుందో తెలుసా...
అనుక్షణం ఆస్వాదించాలనేంత..
నీ ఆప్యాయత ఎంత స్వేచ్ఛనిస్తుందో తెలుసా..
నిన్ను చూడాలనే మనసైన ప్రతీసారి రెక్కలు కట్టుకుని ధైర్యంగా నీ ముంగిట వాలేంత..
నీ అనురాగం ఎంత బలాన్నిస్తుందో తెలుసా..
మనసు బరువైన ప్రతీసారి నువ్వున్నావన్న భరోసానిచ్చేంత..!!
-జయశ్రీ