- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
- సిలికానా౦ధ్ర మనబడి తెలుగు విశ్వవిద్యాలయ౦ స్నాతకోత్సవం
- సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం
- అద్వితీయం, కమనీయం, నేత్రానందం - శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ఉత్సవం
- సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి
- Siliconandhra Antarjateeya Mangalavadya Sammelanam
- సిలికానాంధ్ర మనబడి కి డల్లాస్ లో చక్కటి ఆదరణ
- Manabadi 5th Anniversary Celebrations
- Antarjaateeyya Mangala Vaadya Sammelanam On May 5th And 6th
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
అమెరికా,కెనడాలలో 'తెలుగుకుపరుగు' నిర్వహించిన సిలికానాంధ్ర మనబడి
డెట్రాయిట్, ఆగష్టు 19, 2017 : అమెరికాలోని పది రాష్ట్రాలలోని పదహారు నగరాలందు, మరియు కెనడా లోని టోరంటో నగరం నందు సిలికానాంధ్ర మనబడి వారు అత్యంత ప్రతిస్టాత్మకం గా నిర్వహింఛిన Run4Telugu “తెలుగుకు పరుగు” 5K Run /Walk కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించి అధ్బుతమైన విజయాన్ని సాధించింది. భాషాసేవయే భావితరాల సేవ, “ఆరోగ్యమే మహా భాగ్యం”, “ప్రతి అడుగూ అక్షరానికి అంకితం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన నాయకత్వంతో ముందుకు తీసుకు వెళ్లారు తెలుగుకు పరుగు గ్లోబల్ నాయకుడు వెంకట్ దిడుగు గారు, ఆయన మాట్లాడుతూ తెలుగు వారిలో ఆరోగ్యంపట్ల , వ్యాయామం పట్ల మరింత ఆవగాహన కల్పించటమే ఈ కార్యకమంయొక్క ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.అలాగే సిలికానాంధ్ర చిరకాల స్వప్నం “తెలుగు భాషను ప్రాచీన భాష హోదానుంచీ ప్రపంచ భాష హోదాకు తీసుకెళ్ళటం, దానికి కొలమానం తెలుగు తేలియని వారు, తెలుగు గురించి మాట్లాడుకోవటం , తెలుగు భాషను నేర్చుకోవటం. ఈ ప్రయాణానికి తెలుగుభాషా సైనికుల ఆరోగ్యం అత్యంత అవశ్యం, అందుకే ఈ పరుగు ఒక మహా యజ్ఞం.
ఈ కార్యక్రమానికి అమెరికాలోని డిట్రాయిట్, చికాగో, వర్జీనియా, మేరీలాండ్, న్యూజెర్సీ, కాన్సస్, లూయివిల్, బేఏరియా, లాస్ఏన్జలస్ , డల్లాస్, శాన్ఆంటోనియో, శాన్డియగో,లిటిల్రాక్, హూస్టన్, కెల్లర్ మరియు కెనడా దేశం లోని టొరొంటో నగరాలనుంచి సుమారు రెండు వేలమంది తెలుగుభాషాభిమానులు పెద్దలు, పిల్లలు అనే తారతమ్యంలేకుండా అందరూ కదంతొక్కి ముందుకు కదిలి తెలుగు భాష ఫై వారికున్న ప్రేమాభిమానాన్ని5K Run /Walk ద్వారా చాటుకున్నారు.
ఫై నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలలో నాయకత్వం అందించిన వీరా గుండు, వెంకట్ బట్టారాం, పల్లవి మెలమ్తూర్, నవీన్ పొట్లూరి, నందా చెలువాడి, వంశీ గోపు, గౌడ్ రామాపురం, నాగ ఆకెళ్ళ, సాయి సుందరి, వెంకట్ గంగవరపు, రఘురాం తాడిమళ్ళ, ఆశిష్ దువ్వూరు, ధనుష్ బత్తల, మోహన్ పల్లపోతు, సౌమ్య దువ్వూరు, విజయ్ అడ్డాల, రత్నేస్వర్ మర్రె, రవి గుమ్మడిపుడి, సతీష్ వడ్లమాని, బాలు మామిడి, సుధీర్ మండలి , శ్రీదేవి అల్లం, అనసూయ తలగడదివి, శ్రీకర్, తలగడదివి, నళిని దేవినేని, వేణు సాదు , భాస్కర్ రాయవరం మరియు శ్రీనివాస్ యార్లగడ్డ, దీనబాబు కొండుభట్ల కృషి శ్లాఘనీయం.
ఈ సందర్భంగా మనబడి కులపతి రాజు చమర్తి మాట్లాడుతూ, వచ్చేసంవత్సరం తెలుగుకుపరుగు ని అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలలో 27వేల మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పిస్తూ, వారికి మన భారతీయతతో పాటు తెలుగుదనం పరిచయం చేస్తున్న మనబడి కొత్త విద్యాసంవత్సరం 2017-18 తరగతులు సెప్టెంబర్ 9 నుండి 250 కేంద్రాలలో ప్రారంభమౌతున్నాయని, తమ పిల్లలకు తెలుగు నేర్పించాలనుకునే తల్లితండ్రులు manabadi.siliconandhra.org ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 1844 626 2234 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు.