- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
- సిలికానా౦ధ్ర మనబడి తెలుగు విశ్వవిద్యాలయ౦ స్నాతకోత్సవం
- సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం
- అద్వితీయం, కమనీయం, నేత్రానందం - శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ఉత్సవం
- సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి
- Siliconandhra Antarjateeya Mangalavadya Sammelanam
- సిలికానాంధ్ర మనబడి కి డల్లాస్ లో చక్కటి ఆదరణ
- Manabadi 5th Anniversary Celebrations
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
వేలాది సంవత్సరాలుగా తెలుగు సంస్కృతిలో అంతర్భాగమైన మంగళవాద్యాలకు పునర్వైభవం సాధించే దిశగా "అంతర్జాతీయ మంగళ వాద్య సమ్మేళనం" నిర్వహిస్తున్నట్లు సిలికాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తెలియజేశారు.
2012 మే 5, 6 తారీకుల్లో గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం వారి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో మరియు లాల్ బహుదూర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ మంగళ వాద్య సమ్మేళనానికి నాందీ ఉత్సవం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కూచిభొట్ల ఆనంద్ ప్రసంగిస్తూ తరతరాలుగా మంగళ వాయిద్య కళను నమ్ముకున్న వారు నేడు ఉపాధి కరువై ఇతర రంగాలకు మళ్ళుతుండడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అనేక దేశాల నుండి మంగళవాద్య కళాకారులు వేలాదిగా పాల్గొంటున్నారని తెలియజేశారు. మంగళ వాద్య కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మార్గాలు, ఉపాధి మార్గాలు పెరుగుదల, ఈ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
6 వ తేదీ సాయంతం లాల్ బహుదూర్ స్టేడియంలో 1000 మందికి పైగా మంగళ వాద్య విద్వాంసులచే "మహా మంగళ వాద్య ధ్వానం" జరుగుతుందని తెలియజేశారు. మంగళ వాద్యాలకు తిరిగి విశేష ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా తామీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
అంతర్జాతీయ మంగళ వాయిద్య కార్యక్రమానికి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్మాట్లాడుతూ తెలుగు వారి సాంస్కృతిక వారసత్వ సంపదైన మంగళవాద్య కళను ఆదరించడం అందరి బాధ్యత అన్నారు. తెలుగువారి మహోన్నత సంస్కృతిని యువతరానికి అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. శుభప్రదమైన కార్యక్రమాలన్నీ మంగళ వాయిద్యంతోనే మొదలవడం మన సంప్రదాయమన్నారు. వేలాది మంగళ వాయిద్య కళాకారులు ఒక్కసారిగా తమ కళను ప్రదర్శించే మహాద్భుత ఘట్టానికి హైదరాబాద్ నగరం వేదిక కావడం ఆనందదాయకమన్నారు. మంగళ వాద్య కళకు విశేష ప్రాచుర్యం కల్పించే విధంగా కార్యక్రమాలుంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో డోలు సామ్రాట్ తరిగొప్పుల నారాయణ, ప్రముఖ పరిశోధకులు, ఆచార్యులు డా భూసురపల్లి వెంకటేశ్వర్లు, నాదస్వర విద్వాంసులు మాల్యాద్రి ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలనుండి మంగళ వాద్యకళాకారులు హాజరైన ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.